విశాఖలో మరో విషాదం... కరోనాతో 14 ఏళ్ల బాలిక మృతి

By Arun Kumar PFirst Published Apr 28, 2021, 10:26 PM IST
Highlights

కరోనా బాధపడుతూ విశాఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కీర్తి(14)అనే బాలిక మరణించింది. 

విశాఖపట్నం: కరోనాతో బాధపడుతూ వైద్యం అందక ఏడాదిన్న చిన్నారి మృత్యువాతపడిన ఘటన మరువకముందే విశాఖలో అలాంటిదే మరో విషాద ఘటన చోటుచేసుకుంది. కరోనా బాధపడుతూ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కీర్తి(14) బాలిక డాక్టర్ల సూచన మేరకు కేజిహెచ్ లో చేరింది. అయితే అక్కడ బాలిక ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి ఇవాళ  మృతి చెందింది. 

అయితే బాలిక హెల్త్ కండిషన్ ను తమకు తెలియజేయ లేదంటూ బంధువులు కేజీహెచ్ వైద్యులపై మండిపడుతున్నారు. తాము ఆందోళనకు దిగడంతో సిసి టివి ఫుటేజ్ ల ద్వారా ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు చూపించి ఆపై మృతి చెందినట్లు వెల్లడించారని ఆరోపించారు. దీంతో ఆసుపత్రి వద్దే బంధువులు ధర్నాకు దిగారు.

read more  ఏపీపై కరోనా దండయాత్ర: ఒక్కరోజులో 14 వేలకు పైగా కేసులు.. 71 మరణాలు

ఇదే విశాఖ కేజీహెచ్ వద్ద నిన్న(మంగళవారం) హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. కరోనాతో ఏడాదిన్నర పాప ప్రాణాలు కోల్పోయింది. అచ్యుతాపురంకు చెందిన ఈ పాపకు కరోనాగా తేలింది. మంగళవారం చిన్నారి పరిస్ధితి విషమంగా వుండటంతో తల్లిదంద్రులు కేజీహెచ్‌కు తరలించారు.

 అయితే బెడ్స్ ఖాళీగా లేకపోవడంతో చేర్చుకోలేమని సిబ్బంది చెప్పారు. దీంతో పాపను గంట పాటు అంబులెన్స్‌లో వుంచి ఆక్సిజన్ అందజేశారు. అయితే సకాలంలో వైద్యం అందకపోవడంతో చిన్నారి అంబులెన్స్‌లో కన్నుమూసింది.  

click me!