రాయలసీమ ఎత్తిపోతల పథకం.. డీపీఆర్‌ ఇలాగేనా పంపేది: ఏపీకి కేంద్రం చురకలు

By Siva KodatiFirst Published Dec 17, 2020, 9:56 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ విషయంలో కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ విషయంలో కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

సర్కార్ సమర్పించిన డీపీఆర్‌లో రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక అంశాలు లేవని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ అసహనం వ్యక్తం చేసింది.

ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌కి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సంచాలకులు లేఖ రాశారు. హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర అనుమతులు, ఇరిగేషన్‌ ప్లానింగ్‌, డిజైనింగ్‌, కాస్ట్‌ ఎస్టిమేట్‌ తదితర ప్రాథమిక అంశాలను డీపీఆర్‌లో వెల్లడించలేదని కేంద్రం లేఖలో పేర్కొంది.

డీపీఆర్‌ సమర్పించే విధానంలోనూ సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు పాటించలేదని అభిప్రాయపడింది. ఎలాంటి ప్రాథమిక అంశాలు లేని డీపీఆర్‌ను పరశీలించడం సాధ్యం కాదని.. నిర్ణీత మార్గదర్శకాల మేరకు పూర్తి అంశాలను పొందుపర్చి మరోసారి డీపీఆర్‌ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తెలిపింది. 

click me!