‘‘ నువ్వు ఖర్జూర నాయుడు, కిస్‌మిస్ నాయుడు రాజ్యాంగాలు నడుపుతున్నావా’’

Siva Kodati |  
Published : Dec 17, 2020, 07:16 PM IST
‘‘ నువ్వు ఖర్జూర నాయుడు, కిస్‌మిస్ నాయుడు రాజ్యాంగాలు నడుపుతున్నావా’’

సారాంశం

అమరావతి సభలో ప్రభుత్వానికి చంద్రబాబు సలహాలు ఇస్తాడేమోనని తాను చూశానని కానీ అది ఎక్కడ కనిపించలేదన్నారు మంత్రి కొడాలి నాని. చంద్రబాబుకు మతిభ్రమించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని జగన్ చెప్పిన అరగంటలో పిచ్చిపిచ్చిగా వాగారని మండిపడ్డారు. 

అమరావతి సభలో ప్రభుత్వానికి చంద్రబాబు సలహాలు ఇస్తాడేమోనని తాను చూశానని కానీ అది ఎక్కడ కనిపించలేదన్నారు మంత్రి కొడాలి నాని. చంద్రబాబుకు మతిభ్రమించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని జగన్ చెప్పిన అరగంటలో పిచ్చిపిచ్చిగా వాగారని మండిపడ్డారు.

టీడీపీ ఉప ప్రాంతీయ పార్టీ తప్పించి, జాతీయ పార్టీ కాదని ఆయన చెప్పారు. తెలుగుదేశం జాతీయ పార్టీ అని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి వెళ్లిపోతానని నాని సవాల్ విసిరారు. 

టీడీపీని ఎన్టీఆర్ దగ్గరి నుంచి చంద్రబాబు కొట్టుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. 1983లో ఓడిపోయిన తర్వాత ఎన్టీఆర్ కాళ్ల దగ్గర చంద్రబాబు మోకరిల్లారని సెటైర్లు వేశారు.

ఎన్టీఆర్ కనికరించి పార్టీలో చేర్చుకుంటే వెన్నుపోటు పోడిచారని.. ఇప్పుడు ఫేక్ అమరావతిని సైతం సృష్టించి రైతుల్ని మోసం చేస్తున్నారని నాని ఆరోపించారు. ఐదేళ్ల పాటు అమరావతి గురించి గ్రాఫిక్స్ రిలీజ్ చేశారని ఆయన మండిపడ్డారు.

చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా వుండి ఏనాడైనా దుర్గమ్మకి ఒక్క పట్టుబట్టలు ఇచ్చారా అని కొడాలి నాని ప్రశ్నించారు. నీ అక్రమాలు, దుర్మార్గాలకు శిక్షగా దుర్గమ్మ చంద్రబాబుని 23 సీట్లకే అమ్మవారు పరిమితం చేశారని నాని దుయ్యబట్టారు.

అప్పుడు వెంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు తీసుకెళ్తుండగా.. అలిపిరి వద్ద వెంకన్న బాంబ్ బ్లాస్ట్ చేశాడని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన తిరుపతి వెళ్లలేదన్నారు.

జూమ్ యాప్‌లో కూర్చొని కబుర్లు చెబితే రాజకీయాల్లో ఉన్నట్లా అని నాని నిలదీశారు. మంగళగిరిలో లోకేశ్‌ను ఓడించినట్లే.. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని ఆయన హెచ్చరించారు.

ఎన్టీఆర్‌కు ఎలాంటి చావు తీసుకొచ్చారో.. జగన్‌ ద్వారా చంద్రబాబుకు అదే గతి పడుతుందని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం చేస్తే.. చంద్రబాబు సీఎం అయిన వెంటనే దానిని ఎత్తేశారని కొడాలి నాని మండిపడ్డారు.

మా పార్టీ నేతలు ఎవరూ మహిళల చీరలు లాగలేదని ఎద్దేవా చేశారు. మాట్లాడితే రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారని.. నువ్వు ఖర్జూర నాయుడు రాజ్యాంగం నడుపుతున్నావా అంటూ నాని మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Cold Waves : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్
Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu