ఏపీకి వ‌ర‌ద‌సాయం అందించండి- అమిత్‌షాను కోరిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

By team teluguFirst Published Dec 8, 2021, 2:54 PM IST
Highlights

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలు సమావేశం అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు విషయాలు చర్చించారు. 

ఏపీకి వ‌ర‌ద సాయం అందించాల‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైసీపీ ఎంపీ విజ‌య‌సారెడ్డి కోరారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఏపీకి రావాల్సిన నిధులు, ఇత‌ర విషయాలు చ‌ర్చించేందుకు హోంమంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీలు విజ‌యసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలు బుధవారం భేటీ అయ్యారు. ఇటీవ‌ల వ‌ర‌దలు వ‌చ్చి ఏపీని అత‌లాకుత‌లం చేశాయ‌ని చెప్పారు. దీంతో రాష్ట్రం తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని తెలిపారు. వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు కేంద్ర నుంచి నిధులు విడుద‌ల చేయాల‌ని కోరారు. వ‌ర‌ద న‌ష్టం నుంచి ఏపీ కోలుకునేందుకు సాయం చేయాల్సిందిగా అభ్య‌ర్థించారు.

https://telugu.asianetnews.com/andhra-pradesh/cm-ys-jagan-mohan-reddy-wants-atms-set-up-rbks-and-grama-sachivalayam-r3s3eo

అలాగే పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో కూడా హోం మంత్రితో వారు చ‌ర్చించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌రుఫున ఒక నివేదిక‌ను అమిత్ షాకు అందించారు. ఏపీలో పొల‌వ‌రం అతి ప్ర‌ధాన ప్రాజెక్టు అని తెలిపారు. ఇది ఏపీకి అతి ముఖ్య‌మైన‌ద‌ని వివ‌రించారు. అయితే పోల‌వ‌రం ప్రాజెక్ట‌కు సంబంధించి అంచాన‌లు స‌వ‌రించామ‌ని చెప్పారు. ఆ స‌వ‌రించిన అంచ‌నాలు కేంద్రం ఆమోదించాల‌ని కోరారు. అవిభ‌క్త ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేంద్ర స‌హ‌కారాలు అందించాని విన్న‌వించారు. 

click me!