మాట వినని మంత్రులు, ఉన్నతాధికారులు

Published : Dec 15, 2016, 09:03 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
మాట వినని మంత్రులు, ఉన్నతాధికారులు

సారాంశం

ఫై స్ధాయిలోని వారే ఆన్ లైన్ లావాదేవీలు నిర్వహించటం లేదంటే ఇక మిగిలిన ప్రభుత్వ యంత్రాంగం మాట గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులే సిఎం మాట వినటం లేదు. పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలపై చంద్రబాబునాయడు గురువారం సమీక్ష చేసారు. ప్రజావసరాలకు తగ్గుట్లుగా డబ్బు అందుబాటులో లేని విషయం తెలిసిందే కదా. ఆ విషయం మీదే సిఎం సమీక్ష చేసారు.

 

రాష్ట్రంలోని ప్రజలందరినీ నగదు రహిత లావాదేవీల వైపు మళ్ళాల్సిందిగా సిఎం గడచిన 15 రోజులుగా ఊదరగొడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సరే రాష్ట్ర ప్రజల్లో ఎంతమంది క్యాష్ లెస్ ట్రాన్స్క్షన్స్ వైపు మళ్ళారో తెలీదు.

 

అందుకనే, ప్రజల సంగతి కొద్దిసేపు పక్కనబెట్టి కనీసం ప్రభుత్వంలోని మంత్రులు, ఎంఎల్ఏలతో పాటు ఉన్నతాధికారుల్లో ఎంత మంది నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నారో తెలుసుకోవాలని అనుకున్నారు సిఎం.

 

అనుకున్నదే తడవుగా అక్కడే ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులను ప్రశ్నించారు. దాంతో వారు చెప్పిన సమాధానం విన్న చంద్రబాబు బిత్తరపోయారు. ఎందుకంటే, మంత్రులు, ఎంఎల్ఏలు, ఉన్నతాధికారుల్లో  కనీసం 20 శాతం మంది కూడా ఆన్ లైన్ లావాదేవీలు నిర్వహించటం లేదట.

 

ఉన్నతాధాకారులు చెప్పిన విషయం విన్న తర్వాత సిఎంకు ఏమి చెప్పాలో కాసేపు అర్ధం కాలేదు.

 

గడచిన 20 రోజులుగా రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు క్యాష్ లెస్ లావాదేవీల గురించి పాఠాలు చెబుతున్నా మంత్రులు, ఎంఎల్ఏ, ఉన్నతాధికారులకే బుర్రలోకి ఎక్కలేదంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి?

 

ఫై స్ధాయిలోని వారే ఆన్ లైన్ లావాదేవీలు నిర్వహించటం లేదంటే ఇక మిగిలిన ప్రభుత్వ యంత్రాంగం మాట గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

 

ఇక, డబ్బు అందుబాటు గురించి మాట్లాడుతూ, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ప్రభుత్వం ఇస్తున్న ఫించన్లను బ్యాంకు అకౌంట్ల ద్వారా అందించి పొరబాటు చేసినట్లు సిఎం వాపోయారు.

 

అయితే, గుడ్డిలో మెల్లలాగ ఇక్కడ సిఎం సంతోషించే విషయం కూడా ఓటుంది. అదేంటంటే, బార్లలో మాత్రం ఆన్ లైన్ లావాదేవీలు పెరిగాయట.

 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu