అడ్డుగోలు వాదన టిడిపికే సాధ్యం

First Published Oct 24, 2017, 7:33 AM IST
Highlights
  • ఇంత విచిత్రమైన, అడ్డుగోలు వాదన వినిపించటం దేశం మొత్తం మీద తెలుగుదేశంపార్టీ నేతలకు తప్ప ఇంకోరికి సాధ్యం కాదేమో?
  • ఏ విషయంలోనైనా సరే ఎదుటి వాళ్ళదే తప్పని వాదించేందుకు ఎంతకైనా తెగిస్తారు.
  • ఎందుకంటే, రాష్ట్రంలో మెజారిటీ మీడియాకు వాస్తవాలు తెలిసినా కళ్ళకు ‘పచ్చ గంతలు’ కట్టుకుంది కాబట్టి, వాళ్ళు చెప్పినదాన్నే ప్రచారం చేస్తుంది.

ఇంత విచిత్రమైన, అడ్డుగోలు వాదన వినిపించటం దేశం మొత్తం మీద తెలుగుదేశంపార్టీ నేతలకు తప్ప ఇంకోరికి సాధ్యం కాదేమో? ఏ విషయంలోనైనా సరే ఎదుటి వాళ్ళదే తప్పని వాదించేందుకు ఎంతకైనా తెగిస్తారు. ఎందుకంటే, రాష్ట్రంలో మెజారిటీ మీడియాకు వాస్తవాలు తెలిసినా కళ్ళకు ‘పచ్చ గంతలు’ కట్టుకుంది కాబట్టి, వాళ్ళు చెప్పినదాన్నే ప్రచారం చేస్తుంది. నిజానికి పాదయాత్రకు సంబంధించి కోర్టులో సోమవారం జగన్ కు పెద్ద ఊరటే లభించింది.

ప్రస్తుతం ప్రతీ శుక్రవారం జగన్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవుతున్నారు. అటువంటిది ఇకనుండి నెలకొకసారి హాజరైతే చాలని ఆదేశించింది. నిజానికి జగన్ కు ఎంత పెద్ద ఊరట? కానీ టిడిపి నేతలు, ‘పచ్చ మీడియా’ మాత్రం జగన్ పిటీషన్ ను కోర్టు కొట్టేసిందనే ప్రచారం చేస్తోంది. అంటే, కోర్టు చెప్పిందాంతో వీరికి సంబంధం లేదు. తాము ఏం చెప్పదలుచుకున్నారో అదే చెబుతారన్న విషయం మరోమారు స్పష్టమైంది.

ఇదే విషయమై పలువురు మంత్రులు జగన్ పై ధ్వజమెత్తారు. ‘కేసుల మాఫీకే పార్టీ నడుపుతున్నారట. మంత్రులు కళా వెంకట్రావు, పత్తిపాటి పుల్లారావు, నిమ్మకాయల చిన్నరాజప్పతో పాటు బుద్దా వెంకన్న, వైవిబి రాజేంద్రప్రసాద్ తదితరులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. దేశంలో అతిపెద్ద ఆర్ధిక నేరగాడు జగన్ అన్నారు. జగన్ లాంటి ఆర్ధిక నేరగాడు దేశంలోనే మరొకరు లేరని కూడా ధ్వజమెత్తారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవటానికే జగన్ పార్టీ నడుపుతున్నారట.

ఒకవేళ మంత్రులు చెప్పిందే నిజమైతే, అదే సూత్రం చంద్రబాబునాయుడుకూ వర్తిస్తుంది కదా? ఎందుకంటే, చంద్రబాబుపైన కూడా అనేక కేసులు కోర్టుల్లో విచారణ జరగకుండా పెండిగ్ లో ఉన్నాయి. ఆర్ధిక మోసాల కేసులతో సావాసం చేసే జగన్ పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటే మంచిదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సలహా ఇచ్చారు. ఎన్నికల నాటికి జగన్ జైలుకు వెళ్ళటం ఖాయమట. పాదయాత్ర కూడా కేసుల నుండి తప్పించుకునేందుకేనట. జగన్ చేయాల్సింది పాదయాత్ర కాదని జైలుయాత్ర అని టిడిపి ఎద్దేవా చేయటం గమనార్హం.

click me!