రోజా నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతుంది.. సోమిరెడ్డి

Published : Oct 02, 2018, 11:57 AM IST
రోజా నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతుంది.. సోమిరెడ్డి

సారాంశం

ముఖ్యమంత్రి, మంత్రులను తిట్టడమే రోజా పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. 


వైసీపీ ఎమ్మెల్యే రోజా పై మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే రోజా.. నోటికి ఏదొస్తే.. అదే మాట్లాడుతుందని ఆరోపించారు. ఈ రోజు విలేకరులతో మాట్లాడిన ఆయన రోజా పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యువనేస్తం పేరిట నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా...దీనిపై రోజా తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి సోమిరెడ్డి..ముఖ్యమంత్రి, మంత్రులను తిట్టడమే రోజా పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. 

రోజాకు రాజకీయాల్లో ఏబీసీడీలు కూడా తెలియవని ఎద్దేవా చేశారు.గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రోజా ఇలాగే నోటికొచ్చినట్లుగా మాట్లాడేవారని గుర్తుచేశారు. రాష్ట్రంలో అర్హులందరికి నిరుద్యోగ భృతి ఇచ్చి తీరుతామని మంత్రి హామీ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్