పోలవరం బాధితులకు రుణపడి ఉన్నాం.. పవన్

By ramya neerukondaFirst Published Oct 2, 2018, 11:01 AM IST
Highlights

భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా, న్యాయం చేయకుండా పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తౌతుందని ఆయన ప్రశ్నించారు.

మన తాగు, సాగు నీటి అవసరాలను తీర్చేందుకు వారి జీవితాలు పణంగా పెట్టిన పోలీవరం బాధితులకు మనమంతా రుణపడి ఉన్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారిని ఆదుకోవడం ప్రజలందరి సమిష్టి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. రోడ్ల విస్తరణలో జాతీయ ప్రాజెక్టుల కోసం ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి అంతే స్థాయి జీవితాన్ని ఇవ్వడం అందరి బాధ్యత అని ఆయన అన్నారు. భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా, న్యాయం చేయకుండా పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తౌతుందని ఆయన ప్రశ్నించారు.

పోలవరం బాధితులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం జంగారెడ్డిగూడెంలోని రాజారాణి కళ్యాణ మంటపంలో పోలవరం భూ నిర్వాసితులతో సమావేశమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ నిర్వాసితులు తమకు పరిహారం చెల్లింపులో ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష, చేస్తున్న అన్యాయాన్ని తెలిపారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..‘‘ ప్రభుత్వం మాట వినని పక్షంలో కలిసివచ్చే పార్టీలతో పోలవరంపై నిరసన యాత్ర చేస్తాం ఇన్ని లక్షల మంది జీవితాలు త్యాగం చేస్తే, ఇళ్లు వాకిళ్లు వదిలేసి ముందుకు వస్తే ఎవరూ వారి గోడు వినే పరిస్థితి లేదు. చింతలపూడి రైతులు ఇదే తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోతే రైతలుకు బాకీ ఉన్నట్లు బాకీ పత్రాలు ఇవ్వాలి.’’ అని పవన్ డిమాండ్ చేశారు.
 

click me!