గాడిదలు కాయడానికి పవన్ పార్టీ పెట్టాడా..?: మంత్రి రోజా తీవ్ర విమర్శలు

Published : Jul 19, 2023, 02:29 PM ISTUpdated : Jul 19, 2023, 02:50 PM IST
గాడిదలు కాయడానికి పవన్ పార్టీ పెట్టాడా..?: మంత్రి రోజా తీవ్ర విమర్శలు

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. పవన్ ప్యాకేజ్ కోసం పనిచేస్తున్నాడని.. ప్రజల కోసం కాదని తాము ఎప్పటినుంచో చెబుతున్నామని అన్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. పవన్ ప్యాకేజ్ కోసం పనిచేస్తున్నాడని.. ప్రజల కోసం కాదని తాము ఎప్పటినుంచో చెబుతున్నామని అన్నారు. పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి జనసేన పార్టీ శ్రేణుల పరువు తీశాడని.. వాళ్లను అక్కడ తాకట్టు పెట్టబోతున్నాడని ఆరోపించారు. పవన్ దళపతి కాదు దళారి అంటూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కోసం పవన్ ఢిల్లీలో దళారిగా  మారాడని ఆరోపించారు. తల్లిని తిట్టినవాళ్ల కోసం పవన్ దళారిగా మారడం సిగ్గుచేట్టు అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కాపులకు, జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ సిగ్గులేకుండా మూడు పార్టీలు కలిసి  పోటీ చేస్తాయని అంటున్నారని మండిపడ్డారు. 

మోదీకి చంద్రబాబు చేసిన అవమానాలు గుర్తున్నాయి.. అందుకే ఎన్డీయే  మీటింగ్‌కు పిలవలేదని విమర్శించారు. కానీ తల్లిని  తిట్టించిన  చంద్రబాబు కోసం పవన్ పాకులాడుతున్నాడని విమర్శించారు. పవన్ పొత్తు పెట్టుకోవడానికి కొత్త పార్టీలు లేక మళ్లీ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నాడని  మండిపడ్డారు. 

పవన్ మీడియా ముందు హీరో.. రాజకీయాల్లో జీరో అని విమర్శించారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోనని పవన్ ప్రగల్భాలు పలికాడని.. ఇప్పుడు సిగ్గులేకుండా అందరి కాళ్లు పట్టుకుంటున్నాడని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. బీజేపీ ఎన్డీయే సమావేశానికి ఆయనను పిలవలేదని అన్నారు. చంద్రబాబు ఎంత ఊసరవెల్లి అనేది బీజేపీకి బాగా తెలుసునని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తానన్న చంద్రబాబు కాంగ్రెస్‌నూ మోసం చేశాడని  విమర్శించారు. 

చంద్రబాబుకు చేసే మనసు లేదు.. పవన్‌కు విషయం లేదని మండిపడ్డారు. పవన్ సినిమాల్లో రైటర్స్ రాసే డైలాగ్స్.. రాజకీయాల్లో చంద్రబాబు రాసిచ్చినా డైలాగ్స్ చెబుతారని ఎద్దేవా చేశారు. ఎక్కడికైనా వెళ్లేటపపుడు మనోహర్‌ను అడగమని అంటారని.. మరి అలాంటింది గాడిదలు కాయడానికా పవన్ పార్టీ పెట్టాడా? అని ప్రశ్నించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!