దత్త పుత్రిక కల నెరవేర్చిన రోజా.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు...

By SumaBala BukkaFirst Published Nov 22, 2022, 12:32 PM IST
Highlights

కరోనా కారణంగా తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయిన ఓ పదో తరగతి బాలికను మంత్రి రోజా దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా అమ్మాయి మెడిసిన్ లో సీటు సాధించి తన కలను సాకారం చేసుకుంది. 

తిరుపతి : నటి, రాజకీయనాయకురాలు రోజా ఇప్పుడు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు. రెండోసారి కూడా నగరి నియోజకవర్గం నుంచి ఎన్నికై..రాజకీయ నాయకురాలిగా అద్భుతంగా రాణిస్తున్నారామె. ఇంతకీ, ఇది కారణం కాదు ఆమెను మెచ్చుకోవడానికి.. అసలు కారణం ఏంటంటే..  2020లో ఘోరమైన కరోనావైరస్ కారణంగా తల్లిదండ్రులిద్దరినీ  కోల్పోయిన తిరుపతికి చెందిన ఓ పదవ తరగతి బాలిక పి. పుష్పకుమారిని ఆమె దత్తత తీసుకున్నారు.

ఆమె చదువుకు అయ్యే ఖర్చులు, భవిష్యత్ ను తీర్చిదిద్దే బాధ్యతను రోజా తీసుకున్నారు. ఆమె దత్తపుత్రిక పుష్పకుమారి పదో తరగతి తరువాత ఇంటర్ లో చేరింది. ఆ ఖర్చులు మొత్తం మంత్రి రోజానే భరించారు. ఆమె ఇప్పుడు ఇంటర్లో ఎక్కువ మార్కులు సాధించింది. నీట్ పరీక్షలలో కూడా ఉత్తీర్ణత సాధించి మెడిసిన్ లో సీటు సంపాదించుకుంది. వైద్యవిద్య చదవడానికి తిరుపతి పద్మావతి మహిళా కళాశాలలో చేరింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం, యువజన సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి రోజా తన దత్త పుత్రిక చదువుకు అయ్యే మొత్తం ఖర్చులను తానే చెల్లించనుంది. 

కూతురు అన్షు సినీ ఎంట్రీపై మంత్రి రోజా క్లారిటీ.. ఆమె ఏం చెప్పారంటే..

రోజా, ఆమె భర్త ఆర్కే సెల్వమణి, పిల్లలు అంశుమాలిక, కృష్ణ లోహిత్‌లు పుష్పను శాలువాతో సత్కరించారు. భవిష్యత్తులో పేదలకు ఉచితంగా వైద్యం అందించడమే తన ఆశయమని, వైద్య సౌకర్యాల కోసం తనలాంటి ఏ అమ్మాయి తల్లిదండ్రులు  ప్రాణాలు కోల్పోకూడదని యువతి పేర్కొంది. రెండేళ్ళ క్రితం రోజా వాగ్దానం చేసిన విధంగా అమ్మాయి తన కలలను సాకారం చేసుకునేలా కృషి చేసిన రోజా.. అసలైన తల్లిగా మారిందని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

click me!