'కక్ష సాధింపుతోనే chandrababu naidu పై కేసు':లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా

Google News Follow Us

సారాంశం


మద్యం తయారీ కంపెనీలకు అనుమతుల విషయంలో దాఖలైన కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.  ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రేపు సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు విన్పిస్తారు. 


అమరావతి: మద్యం తయారీ కంపెనీలకు  ప్రయోజనం కల్గించేలా వ్యవహరించారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ  కేసు నమోదు చేసింది.ఈ కేసులో  చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పై  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణను ఈ నెల  22 వతేదీకి వాయిదా వేసింది.  మంగళవారంనాడు ఈ పిటిషన్ పై విచారణ  జరిగింది.  ఈ పిటిషన్ పై చంద్రబాబు తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. రేపు ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వేస్టిగేషన్ డిపార్ట్ మెంట్ (ఏపీ సీఐడీ)  తరపు న్యాయవాదులు  వాదనలను విన్పించనున్నారు.
 
మద్యం పాలసీని కేబినెట్,అసెంబ్లీ ఆమోదించిన విషయాన్ని చంద్రబాబు తరపు న్యాయవాది గుర్తు చేశారు.  మద్యం షాపులు,బార్లు అనుమతులలో చంద్రబాబుకు సంబంధం లేదని వాదించారు. నాటి ఎక్సైజ్ కమిషనర్  నరేష్ నిర్ణయం తీసుకున్నారని చంద్రబాబు తరపు న్యాయవాది ఏపీ హైకోర్టు దృష్టికి తెచ్చారు. దశలవారీగా లైసెన్సు రుసుము చెల్లించడానికి లైసెన్స్ దారుల విజ్ఞప్తి చేసిన విషయాన్ని చంద్రబాబు న్యాయవాది గుర్తు చేశారు. 

also read:AP Skill development case లో చంద్రబాబు బెయిల్‌‌పై సుప్రీంలో ఏపీ సీఐడీ పిటిషన్

లైసెన్స్ దారుల ఫీజులు వాయిదాల పద్దతిలో  బకాయి చెల్లించడానికి కేబినెట్,అసెంబ్లీ ఆమోదించిందని చంద్రబాబు న్యాయవాది వాదించారు. చంద్రబాబుపై సీఐడీ  మోపిన అభియోగాలపై ఎలాంటి ఆధారాలు లేవని  హైకోర్టు దృష్టికి తెచ్చారు. కక్షపూరితంగానే చంద్రబాబుపై కేసు నమోదు చేశారని వాదనలు విన్పించారు. 25 షాపులకు ఇచ్చిన ప్రత్యేక అనుమతులకు చంద్రబాబుకు ఎటువంటి సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. 

also read:andhra pradesh fiber grid case:ఏడుగురు నిందితుల ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్

ఇదిలా ఉంటే ఇదే కేసులో  మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడ  ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులిచ్చారని ఏపీ బ్రేవరేజేస్ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు ఈ నెల 1వ తేదీన  ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఇవాళ ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది. ఏపీ సీఐడీ తరపు న్యాయవాదుల వాదనలను రేపు విననుంది ఏపీ హైకోర్టు.
 

Read more Articles on