ఆయనంతే.. పార్టీ మారినప్పుడల్లా చెప్పుతో కొట్టుకుంటాడు : కొత్తపల్లి సుబ్బారాయుడికి పేర్నినాని కౌంటర్

Siva Kodati |  
Published : Mar 22, 2022, 06:56 PM ISTUpdated : Mar 22, 2022, 06:58 PM IST
ఆయనంతే.. పార్టీ మారినప్పుడల్లా చెప్పుతో కొట్టుకుంటాడు : కొత్తపల్లి సుబ్బారాయుడికి పేర్నినాని కౌంటర్

సారాంశం

జిల్లాల విభజనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు వ్యవహారశైలిపై మంత్రి పేర్ని నాని చురకలు వేశారు. ఏమైనా వుంటే సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. ప్రజలన్నీ గమనిస్తుంటారని మంత్రి హెచ్చరించారు

కొత్త జిల్లాల (ap new districts) ఏర్పాటుకు సంబంధించి వైసీపీ నేత (ysrcp) , మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు (kothapalli subbarayudu) తీరుపై మంత్రి పేర్ని నాని (perni nani) మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాల విభజనకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి తెలియజేయాలని హితవు పలికారు. నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజును (prasada raju) గెలిపించుకున్నందున చెప్పుతో కొట్టుకుని నిరసన తెలపడాన్ని పేర్ని నాని తప్పుబట్టారు. పార్టీలు మారినప్పుడల్లా సుబ్బారాయుడు చెప్పులతో కొట్టుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని ఉపేక్షించబోమని పేర్ని నాని హెచ్చరించారు. ప్రసాదరాజును రాజకీయంగా పతనం చేసేందుకే కొత్తపల్లి సుబ్బారాయుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.

ఎన్నో పదవులెన్నో చేసి, ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం కొనసాగుతూ.. ఈ విధంగా మాట్లాడటం సుబ్బారాయుడు విలువనే తగ్గించే పరిస్థితి అంటూ నాని చురకలు వేశారు. రాజకీయాలు కావాలంటే ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చని ఆయన హితవు పలికారు. నరసాపురం జిల్లా చేస్తూ, ఆ జిల్లాకు భీమవరం కేంద్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఈ విషయంలో ఎమ్మెల్యేకు ఏం సంబంధం ఉంటుందని పేర్ని నాని ప్రశ్నించారు. 7 నియోజకవర్గాలకు అందుబాటులో ఉంటుందనే ఉద్దేశ్యంతోనే భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఎంపిక చేశామని మంత్రి తెలిపారు. దీనిపై సుబ్బారాయుడికి ఏమైనా అభ్యంతరాలుంటే సీఎంను కలిసి వివరిస్తే అది సముచితం, పద్ధతి అని నాని హితవు పలికారు. ప్రసాదరాజుని రాజకీయంగా అడ్డు తొలగించుకుందామని ఆలోచన చేస్తే ప్రజలన్నీ గమనిస్తుంటారని హెచ్చరించారు. మనకు నచ్చనప్పుడల్లా చెప్పుతో కొట్టుకోవాలంటే ఆయన చాలా సార్లు చెప్పుతో కొట్టుకోవాలి అంటూ పేర్ని నాని చురకలు వేశారు.

కాగా.. పశ్చిమగోదావరి నర్సాపురంలో మాజీ మంత్రి Kothapalli Subbarayudu, నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు మధ్య  కొంత కాలంగా అగాధం ఉంది. Narsapur జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం ఆశ్వర్యంలో సాగిన దీక్షలో ఈ విషయం వెలుగుచూసింది. నర్సాపురంలో All Party ఆధ్వర్యంలో జరిగిన నిరసన దీక్షలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తన చెప్పుతో తానే కొట్టుకొన్నాడు. నర్సాపురంలో ఎమ్మెల్యేగా ముదునూరి ప్రసాద్ రాజును గెలిపించినందుకు గాను చెప్పుతో కొట్టుకొన్నారు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు. అసమర్ధుడిని ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే