
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని (ap cm ys jagan) మంగళవారం అసెంబ్లీలోని (ap assembly) సీఎం ఛాంబర్‌లో ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ (asian powerlifting championship 2021) విన్నర్ షేక్ సాదియా అల్మస్ (sadiya almas) కలిశారు. షేక్ సాదియా అల్మస్ మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో 2021 డిసెంబర్‌లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆమె 3 స్వర్ణ పతకాలు, 1 రజత పతకం సాధించారు. ఈ సందర్భంగా షేక్ సాదియాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల ఆర్ధిక సాయాన్ని సీఎం జగన్ ప్రకటించారు.
అదే విధంగా మంగళగిరిలో పవర్ లిఫ్టింగ్ అకాడమీ (powerlifting academy) ఏర్పాటుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్ (avanthi srinivas), మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (alla ramakrishna reddy) , స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, షేక్ సాదియా తండ్రి సంధాని, రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.