పాచిపోయిన లడ్డూలని.. ఆవురావురుమంటూ తింటున్నారు: పవన్‌పై పేర్ని నాని సెటైర్లు

Siva Kodati |  
Published : Apr 04, 2021, 02:37 PM IST
పాచిపోయిన లడ్డూలని.. ఆవురావురుమంటూ తింటున్నారు: పవన్‌పై పేర్ని నాని సెటైర్లు

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు మంత్రి పేర్ని నాని. పవన్ అద్దె మైక్ లాగా తయారయ్యాడంటై సెటైర్లు వేశారు. ఆదివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడి ఆయన.. టీడీపీ- బీజేపీ ప్రాయోజికత కార్యక్రమంలా పవన్ సభ వుందంటూ ఎద్దేవా చేశారు.

కాల్‌షీట్లకు పవన్ న్యాయం చేశారని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో అని 2014లో పెద్ద పెద్దగా అరిచాడని.. చంద్రబాబుతో రహస్యంగా మాట్లాడాక టీడీపీకి కూడా ఓటేయాలని ప్రజలకు చెప్పావని పేర్ని నాని ధ్వజమెత్తారు.

2019 ఎన్నికలకు ముందు బీజేపీ పాచిపోయిన లడ్డుల ఇచ్చిందని అన్నావంటూ మంత్రి ఎద్దేవా చేశారు. ఇప్పుడు  ఆ పాచిపోయిన లడ్డూలనే పవన్ ఆవురావురుమని తినేస్తున్నాడని నాని సెటైర్లు వేశారు.

తిరుపతి ప్రజలు వైసీపీ నేతల్ని నిలదీయాలని పవన్ చెప్పారని... కానీ నిలయదీయాల్సింది పవన్‌నే అని ప్రజలు మాట్లాడుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. 

కాగా, శనివారం తిరుపతిలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఉప ఎన్నికలో వైసీపీ గెలిస్తే.. ఢిల్లీ వెళ్లి మాట్లాడలేరని ఆయన ఎద్దేవా చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?