ఆరు నెలల తర్వాత సీఎం పదవిలో జగన్ ఉండరు: చింతా మోహన్ సంచలనం

Published : Apr 04, 2021, 01:52 PM IST
ఆరు నెలల తర్వాత సీఎం పదవిలో జగన్ ఉండరు: చింతా మోహన్ సంచలనం

సారాంశం

వచ్చే ఆరు మాసాల తర్వాత సీఎం పదవిలో జగన్ ఉండరని మాజీ  కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

అమరావతి: వచ్చే ఆరు మాసాల తర్వాత సీఎం పదవిలో జగన్ ఉండరని మాజీ  కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీతా రెడ్డి ప్రశ్నలకు సీఎం జగన్  సమాధానం చెప్పాలని 

ఆదివారం నాడు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి రెండేళ్లు దాటినా కూడ ఇంతవరకు హంతకులను పట్టుకోకపోవడంపై ఆయన కూతురు డాక్టర్ సునీత లేవనెత్తిన అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ విషయాలపై సమాధానం చెప్పాలని ఆయన కోరారు.

జగన్ మీద కోపాన్ని ఆయన సోదరి షర్మిల తెలంగాణలో చూపిస్తున్నారన్నారు. ధర్మ యుద్ధంలో సీఎం జగన్ గెలవరని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కు పట్టిన గతే ఈ ఎన్నికల్లో బీజేపీకి పడుతోందన్నారు. అధిక ధరలు బీజేపీ పతనానికి కారణంగా మారుతాయని చెప్పారు. 

ప్రలోభాలు లేకపోతే  కాంగ్రెస్ ను ప్రజలు మళ్లీ ఆదరిస్తారని ఆయన జోస్యం చెప్పారు.తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా చింతా మోహన్ పోటీ చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?