movie tickets issue: ఎల్లుండి తాడేపల్లికి చిరంజీవి రాక.. సీఎం జగన్‌తో పేర్ని నాని కీలక సమావేశం

Siva Kodati |  
Published : Feb 08, 2022, 04:41 PM IST
movie tickets issue: ఎల్లుండి తాడేపల్లికి చిరంజీవి రాక.. సీఎం జగన్‌తో పేర్ని నాని కీలక సమావేశం

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని సమావేశమయ్యారు. ఈ నెల 10న సీఎం జగన్‌తో చిరంజీవి సహా ఇతర సినిమా పెద్దల భేటీ వున్న నేపథ్యంలో జగన్‌తో పేర్ని నాని భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సినిమా టికెట్ల ధరల పెంపు, థియేటర్ సమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వం నియమించిన కమిటీ చేసిన అధ్యయనంపై సీఎంకు నాని వివరించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల పెంపు (movie tickets issue) అంశానికి సంబంధించి జగన్ సర్కార్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో (ys jagan) సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని (perni nani) భేటీ అయ్యారు. ఈ నెల 10న సీఎం జగన్‌తో చిరంజీవి సహా ఇతర సినిమా పెద్దల భేటీ వున్న నేపథ్యంలో జగన్‌తో పేర్ని నాని భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం సీఎం ను కలిసిన మంత్రి పేర్ని నాని పలు అంశాలు చర్చించారు. సినిమా టికెట్ల ధరల పెంపు, థియేటర్ సమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వం నియమించిన కమిటీ చేసిన అధ్యయనంపై సీఎంకు నాని వివరించారు. 

కాగా.. ఈ నెల 10న సీఎం జగన్ తో చిరంజీవి (chiranjeevi) సహా ఇతర సినీ ప్రముఖుల సమావేశం వున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక దాదాపు సిద్దమైంది. ఈ క్రమంలోనే సినిమా ప్రముఖులతో భేటీలో వారి అభిప్రాయాలు తీసుకుని చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. అలాగే సినిమా ధియేటర్ల యజమానుల సమస్య పరిష్కారంపైన చర్చ జరిగే అవకాశాలున్నాయి.

మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతితో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  సినిమా టికెట్ల ధరలు తెలంగాణలో పెంచారని.. ఏపీలో తగ్గించారని చెప్పారు.కానీ రెండు చోట్లా కోర్టుకు వెళ్లారని తెలిపారు. అందుకే సినిమా టికెట్ల ధరలపై సినీ పరిశ్రమ ఏకతాటిపైకి రావాలని అన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందకెళ్తామని చెప్పారు. రెండు ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తున్నాయని అన్నారు.

చిరంజీవి, సీఎం జగన్ మీటింగ్‌‌కు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నపై స్పందించిన మంచు విష్ణు..  పర్సనల్ మీటింగ్‌ను అసోసియేషన్ మీటింగ్‌గా భావించకూడదని అన్నారు. సినీ ఇండస్ట్రీ అంతా పెద్ద కుటుంబం అని చెప్పారు. సినిమా టికెట్ల ధరలు తగ్గించింది కరెక్టా..?, పెంచింది కరెక్టా..? అనేది లాంగ్ డిబేట్ అని అన్నారు. ఇండస్ట్రీ‌లో ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నాయని తెలిపారు. తాను విడిగా మాట్లాడి సమస్యను పక్కదారి పట్టించలేనని చెప్పారు. 

ఇండస్ట్రీ ఒక్కరిది కాదని.. ప్రతి ఒక్కరిది అని అన్నారు.  స్వలాభం కోసం ఎవరూ కూడా పరిధి దాటి మాట్లాడొద్దన్నారు. ఒకరిద్దరు మాట్లాడి దీనిపై వివాదం చేయడం సరికాదని అన్నారు. తాను కూడా పరిధి దాటి మాట్లాడకూడదని అన్నారు. తనకు వ్యక్తిగత అభిప్రాయాలు చాలా ఉంటాయని.. కానీ తాను ఉన్న పొజిషన్‌కు వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకూడదని అన్నారు. తాను ఏది మాట్లాడిని మా అసోసియేషన్ తరఫున మాట్లాడినట్టు అవుతుందని.. అది కరెక్ట్ కాదని చెప్పారు. చాంబర్ ఆఫ్ కామర్స్‌తో అందరం చర్చలు జరుపుతున్నామని తెలిపారు. రెండు ప్రభుత్వాలతో మాట్లాడి సమస్యను పరిష్కారిస్తామని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్