2002 నుంచి అనుబంధం.. మోహన్‌బాబు కాఫీకి పిలిస్తే వెళ్లా, వ్యక్తిగత భేటీనే : మీడియాకు పేర్ని నాని కౌంటర్

Siva Kodati |  
Published : Feb 11, 2022, 06:53 PM IST
2002 నుంచి అనుబంధం.. మోహన్‌బాబు కాఫీకి పిలిస్తే వెళ్లా,  వ్యక్తిగత భేటీనే : మీడియాకు పేర్ని నాని కౌంటర్

సారాంశం

సినీనటుడు మోహన్‌బాబుతో ఏపీ మంత్రి పేర్ని నాని భేటీ కావడం సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మంత్రి మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. 2002 నుంచి మోహన్ బాబు కుటుంబంతో తనకు  వ్యక్తిగతమైన అనుబంధం వుందని... బొత్స సత్యనారాయణ ఇంట్లో పెళ్లికి వెళ్లి, మోహన్ బాబు ఇంట్లో కాఫీ తాగొచ్చానని పేర్ని నాని చెప్పారు

మోహన్ బాబు (mohan babu) పిలిస్తేనే వాళ్ల ఇంటికి వెళ్లానన్నారు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని (perni nani) . శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. సినీ పరిశ్రమకు ఆయన హయాంలో ఏమైనా చేశారా అని పేర్ని నాని ప్రశ్నించారు. సినీ జనాలను రాజకీయాలకు వాడుకోవడం, ఎన్నికల్లో ప్రచారానికి పిలవడం తప్పించి.. సినీ పరిశ్రమకు చంద్రబాబు ఏ మేరకు ఉపయోగపడ్డాడని మంత్రి నిలదీశారు. 

తనకు నచ్చినవాళ్లని ఒకరకంగా .. నచ్చిన వారిని మరోరకంగా ట్రీట్ చేస్తారని పేర్ని నాని ఆరోపించారు. దర్శకుడు గుణశేఖర్‌ను అడిగితే ఆయనే అన్ని చెబుతారంటూ మంత్రి చురకలు వేశారు. చిరంజీవి సినిమాను ఇబ్బందులు పెట్టిన విషయాన్ని ఆయన సోదరుడే విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారని నాని ఆరోపించారు. సినిమా వాళ్లు కాలర్ ఎగరేసుకుని పనిచేసుకునే విధానాన్ని తెచ్చిన వ్యక్తి సీఎం జగన్ అంటూ మంత్రి ప్రశంసించారు. మొన్న ఏడ్చినట్లుగానే ఇవాళ కూడా చంద్రబాబు ఏడుస్తున్నారంటూ పేర్ని నాని చురకలు వేశారు. 

2002 నుంచి మోహన్ బాబు కుటుంబంతో తనకు  వ్యక్తిగతమైన అనుబంధం వుందని... బొత్స సత్యనారాయణ ఇంట్లో పెళ్లికి వెళ్లి, మోహన్ బాబు ఇంట్లో కాఫీ తాగొచ్చానని పేర్ని నాని చెప్పారు. సినిమావాళ్లు పరిష్కారం లభించిందని ఆనందం వ్యక్తం చేస్తే.. చంద్రబాబు విమర్శిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. నిన్న మీటింగ్‌కి చంద్రబాబు వచ్చి ఏమైనా విన్నారా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. ప్రభుత్వం తరపున ఎవరికీ సంజాయిషీ ఇవ్వలేదని.. నేనే చెప్పిన తర్వాతే విష్ణు ట్వీట్ అప్‌డేట్ చేశారని మంత్రి తెలిపారు. ఎవరెవరో ట్వీట్లు చేస్తే తనకు సంబంధం ఏంటని పేర్ని నాని ప్రశ్నించారు. నిన్న సీఎం జగన్‌ను కలిసిన సినిమావాళ్లకు మా పార్టీ సభ్యత్వం వుందా అని మంత్రి నిలదీశారు. ఓర్వలేకే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని పేర్ని నాని దుయ్యబట్టారు. 

అంతకుముందు మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. కులాల మధ్య గొడవ పెట్టడమే టీడీపీకి పని అని చెప్పారు. జిల్లాల పునర్విభజనను స్వాగతిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని ఆయన Chandrababuను కోరారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే వ్యతిరేకిస్తారా అని ఆయన ప్రశ్నించారు. 14 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరును ఎందుకు పెట్టలేదో చెప్పాలని మంత్రి నాని చంద్రబాబును ప్రశ్నించారు. కొత్త జిల్లాలపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మంత్రి చెప్పారు. 

ఉద్యోగులకు ఏం చేశాడో చంద్రబాబు గొప్పగా చెప్పుకోవడం తప్ప ఏమీ లేదన్నారు. చంద్రబాబు ఎలాంటి వాడో ఉద్యోగులే చెప్పాలని మంత్రి నాని చెప్పారు. 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న సమయంలో ఉద్యోగులకు ఫిట్‌మెంట్  ఇచ్చినట్టుగా జీవోలు జారీ చేసినా కూడా ఆ జీవోలు ఎప్పుడు అమల్లోకి వచ్చాయో చెప్పాలన్నారు. చంద్రబాబు ఇచ్చిన జీవోలన్నీ కూడా దొంగ జీవోలేనని చెప్పారు. చంద్రబాబు దేవుడని ఉద్యోగులే చెప్పాలని మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు.

అవకాశం దొరికితే చంద్రబాబు సహా టీడీపీ నేతలపై మంత్రి కొడాలి నాని ఒంటికాలిపై విమర్శలు గుప్పిస్తారు. ఆశోక్ బాబు వ్యవహరంతో పాటు అన్నీ విషయాలపై చంద్రబాబును ఇవాళ మరోసారి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆశోక్ బాబును గురువారం నాడు రాత్రి సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై ఏపీ హైకోర్టులో మధ్యంతర బెయిల్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu