వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు: ఏపీ మంత్రి కొడాలి నాని సంచలనం

By narsimha lode  |  First Published Feb 11, 2022, 4:46 PM IST


ఏపీలో మూడు రాజధానుల అంశం మరో సారి తెరమీదికి వచ్చింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని మంత్రి కొడాలి నాని ప్రకటించారు.



అమరావతి: వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును మరోసారి Assemblyలో ప్రవేశ పెడతామని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. శుక్రవారం నాడు ఏపీ మంత్రి kodali Nani అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆమోదంతో మూడు రాజధానులు నిర్మిస్తామన్నారు. గతంలో శాసనమండలిలో తమకు ఉన్న బలంతో ఈ బిల్లులను టీడీపీ నిలిపివేసిందన్నారు. ప్రతిపక్షాలు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ Ashok Babuఏం తప్పు చేశారని సిగ్గు లేకుండా TDP  నేతలు అడుగుతున్నారని మంత్రి నాని మండిపడ్డారు. ఆశోక్ బాబు అయినా ఏ బాబు అయినా తమ ప్రభుత్వానికి ఒక్కటేనని నాని తేల్చి చెప్పారు. ఆశోక్ బాబు దొంగ సర్టిఫికెట్లతో ప్రమోషన్లను పొందారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. దొంగలను వెనకేస్తోంది దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు నాయుడు అంటూ కొడాలి నాని తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఇంటర్ చదివి Degree  చదివినట్టుగా సర్టిఫికెట్లు పెట్టి ప్రమోషన్ పొందారని మంత్రి చెప్పారు.

Latest Videos

దొంగ సర్టిఫికెట్లు పెట్టారని నిర్ధారణ అయిన తర్వాతే పోలీసులు ఆశోక్ బాబును అరెస్ట్ చేశారని మంత్రి వివరించారు. ఆశోక్ బాబు విషయంలో చట్టప్రకారంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. Court ఎలా చెబితే అలా వ్యవహరిస్తామని మంత్రి తేల్చి చెప్పారు.అశోక్‌బాబుపై ఫిర్యాదు చేసింది  వైఎస్సార్‌సీపీ కాదని  సాటి ఉద్యోగే అశోక్‌బాబుపై ఫిర్యాదు చేశారని మంత్రి గుర్తు చేశారు.అశోక్‌బాబు అరెస్ట్‌పై టీడీపీ గగ్గోలు పెడుతోందన్నారు. అవినీతి పరుడి కోసం టీడీపీ తాపత్రయపడుతోందని విమర్శలు చేశారు. అశోక్‌బాబు కేసును లోకాయుక్త సీఐడీకి అప్పగించిందని మంత్రి గుర్తు చేశారు.  

కులాల మధ్య గొడవ పెట్టడమే టీడీపీకి పని నాని చెప్పారు. జిల్లాల పునర్విభజనను స్వాగతిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని ఆయన Chandrababuను కోరారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే వ్యతిరేకిస్తారా అని ఆయన ప్రశ్నించారు. 14 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరును ఎందుకు పెట్టలేదో చెప్పాలని మంత్రి నాని చంద్రబాబును ప్రశ్నించారు. కొత్త జిల్లాలపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మంత్రి చెప్పారు. 

ఉద్యోగులకు ఏం చేశాడో చంద్రబాబు గొప్పగా చెప్పుకోవడం తప్ప ఏమీ లేదన్నారు. చంద్రబాబు ఎలాంటి వాడో ఉద్యోగులే చెప్పాలని మంత్రి నాని చెప్పారు. 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న సమయంలో ఉద్యోగులకు ఫిట్‌మెంట్  ఇచ్చినట్టుగా జీవోలు జారీ చేసినా కూడా ఆ జీవోలు ఎప్పుడు అమల్లోకి వచ్చాయో చెప్పాలన్నారు. చంద్రబాబు ఇచ్చిన జీవోలన్నీ కూడా దొంగ జీవోలేనని చెప్పారు. చంద్రబాబు దేవుడని ఉద్యోగులే చెప్పాలని మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు.

అవకాశం దొరికితే చంద్రబాబు సహా టీడీపీ నేతలపై మంత్రి కొడాలి నాని ఒంటికాలిపై విమర్శలు గుప్పిస్తారు. ఆశోక్ బాబు వ్యవహరంతో పాటు అన్నీ విషయాలపై చంద్రబాబును ఇవాళ మరోసారి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆశోక్ బాబును గురువారం నాడు రాత్రి సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై ఏపీ హైకోర్టులో మధ్యంతర బెయిల్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 

click me!