చంద్రబాబుకు జగన్ ఫోబియా..స్టీల్ ప్లాంట్ నిర్ణయం కేంద్రానిదే: పెద్దిరెడ్డి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 12, 2021, 2:36 PM IST
Highlights

చంద్రబాబుకు జగన్ ఫోబియా పట్టుకుందని ఎద్దేవా  చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శుక్రవారం తాడేపల్లోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన .. దేశంలో అత్యుత్తమ పాలన అందిస్తున్న సీఎంలలో జగన్ ప్రథమ స్థానంలో వున్నారని గుర్తుచేశారు. 

పంచాయతీ ఎన్నికల ఫలితాలను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని.. పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని పెద్దిరెడ్డి తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం కేంద్రానిదని దీనితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి తేల్చిచెప్పారు.

నాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో వెంకయ్య నాయుడు ఉద్యమానికి నాయకత్వం వహించారని గుర్తుచేశారు. పోస్కో ప్రతినిధులు మర్యాదపూర్వకంగానే జగన్‌ని కలిశారని పెద్దిరెడ్డి వెల్లడించారు. 

అంతకుముందు విశాఖ స్టీల్ ఆంధ్రప్రదేశ్‌కి గుండెకాయ లాంటిదన్నారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. ఉక్కు ఫ్యాక్టరీని వదులుకోవడానికి మేము సిద్ధంగా లేమన్నారు. స్టీల్ ప్లాంట్‌ని కాపాడి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడుదామన్నారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ కేంద్రంతో చర్చలు జరుపుతున్నారన్నారు. పార్లమెంట్‌లో కూడా ఎంపీలు అంత బలంగా పోరాటం చేస్తామని, వైసీపీ పాలనపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.

click me!