ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టుకు ఎమ్మెల్యే: లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన జోగి రమేష్

Published : Feb 12, 2021, 01:30 PM IST
ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టుకు ఎమ్మెల్యే: లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన జోగి రమేష్

సారాంశం

:రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను సవాల్ చేస్తూ పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ శుక్రవారం నాడు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

అమరావతి:రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను సవాల్ చేస్తూ పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ శుక్రవారం నాడు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఇతర పార్టీల తరపున పోటీ చేసేవారికి సంక్షేమ పథకాలు కట్ చేస్తామని ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.ఈ వ్యాఖ్యలపై ఎస్ఈసీ స్పందించింది.

also read:పంచాయితీ ఎన్నికలు: జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఈ నెల 13వ తేదీ వరకు మీడియాతో మాట్లాడొద్దని ఎస్ఈసీ ఆంక్షలు విధించింది. అంతేకాదు సమావేశాల్లో కూడ ప్రసంగించొద్దని కూడ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఆదేశాలపై ఏపీ హైకోర్టులో జోగి రమేష్ శుక్రవారం నాడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ఈసీ ఆదేశాలను సస్పెండ్ చేయాలని ఆ పిటిషన్ లో ఎమ్మెల్యే కోరారు. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణకు స్వీకరించింది. ఇవాళ మధ్యాహ్నం  ఈ పిటిషన్ పై విచారణ సాగనుంది.


 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?