Badvel ByPoll: ఏపీకి తీరని ద్రోహం చేశాయి.. బీజేపీ, కాంగ్రెస్‌లపై మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 14, 2021, 5:58 PM IST
Highlights

బీజేపీ (BJP), కాంగ్రెస్ (congress) పార్టీలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాయని మండిపడ్డారు. ఈరోజు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి దాసరి సుధలతో కలిసి బద్వేల్ ఉపఎన్నిక (badvel bypoll) ప్రచారంలో పాల్గొన్నారు

బీజేపీ (BJP), కాంగ్రెస్ (congress) పార్టీలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాయని మండిపడ్డారు. ఈరోజు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి దాసరి సుధలతో కలిసి బద్వేల్ ఉపఎన్నిక (badvel bypoll) ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చేసిన పాపం వారిని రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అడ్రస్ కోల్పోయేలా చేసిందని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. 

బీజేపీ గురించి ఏపీ ప్రజలకు సరిగా తెలియదని... ఆ పార్టీకి ఎవరూ ఓటు వేయరని రామచంద్రారెడ్డి అన్నారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థల ద్వారా పాలనను ప్రజలకు చేరువ చేశామని మంత్రి చెప్పారు. అర్హతే కొలబద్దగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని వెల్లడించారు. కరోనా వల్ల తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొంటూనే రాష్ట్రంలో సంక్షేమం కుంటుపడకుండా సీఎం జగన్ పాలన అందిస్తున్నారని కొనియాడారు.

బద్వేల్ నియోజకవర్గంలో తాగు, సాగునీటి కోసం తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గత ప్రభుత్వాలు చేయలేదని రామచంద్రారెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (ys avinash reddy) మాట్లాడుతూ, సంక్షేమం, అభివృద్ధిని అన్ని కుటుంబాలకు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ పాలన గురించి ప్రతి ఒక్క ఓటరుకి వివరించాలని వైసీపీ శ్రేణులకు అవినాశ్ రెడ్డి పిలుపునిచ్చారు.

ALso Read:ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు: హుజురాబాద్‌ బరిలో 37 మంది.. బద్వేల్‌లో 15 మంది

వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య (venkata subbaiah) ఆకస్మిక మరణంతో బద్వేల్‌ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. కోవిడ్‌తో వాయిదా పడిన ఎన్నికలను అక్టోబర్‌లో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (election commission) షెడ్యూలు విడుదల చేసింది. అయితే, దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణికే వైసీపీ టికెట్‌ ఇచ్చినందున జనసేన (janasena) పోటీ చేయడం లేదని ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ (pawan kalyan) ప్రకటించారు. పవన్ పోటీకి దూరమని ప్రకటించిన కొద్ది గంటల్లోనే టీడీపీ (tdp) సైతం విరమించుకుంటున్నట్లు వెల్లడించింది. గత సంప్రదాయాలను గౌరవిస్తూ తాము బద్వేల్ ఉపఎన్నిక బరి నుంచి తప్పుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. 

అయితే, బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించింది. ఈ మేరకు పనతల సురేశ్‌ను అభ్యర్ధిగా వెల్లడించింది. మిత్రపక్షమైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటనకు భిన్నంగా ఏపీ బీజేపీ (bjp) అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) సీరియస్ కామెంట్స్ చేశారు. బద్వేల్ ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. వైసీపీకి భయపడాల్సిన అవసరం లేదని బద్వేల్ ఎన్నికకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

click me!