ఏపీ రాష్ట్రంలో గత 24 గంటల్లో 540 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 20,59,122కి చేరుకొన్నాయి.దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,286 కి చేరింది.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) రాష్ట్రంలో కరోనా (corona cases) కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో40,350 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 540 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా కేసులు 20,59,122కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి పది మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,286 కి చేరింది.
also read:ఇండియాలో కరోనా కేసుల పెరుగుదల: మొత్తం 3,40,20, 730కి చేరిక
గడిచిన 24 గంటల్లో 557 మంది కోవిడ్ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 20లక్షల 35వేల 353 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 6588 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,88,79,945 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
గత 24 గంటల్లో అనంతపురంలో007,చిత్తూరులో 170, తూర్పుగోదావరిలో073,గుంటూరులో111,కడపలో 022, కృష్ణాలో060, కర్నూల్ లో004, నెల్లూరులో045, ప్రకాశంలో 027,విశాఖపట్టణంలో 045,శ్రీకాకుళంలో003, విజయనగరంలో 007,పశ్చిమగోదావరిలో 016కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో కరోనాతో పది మంది మృతి చెందారు. ప్రకాశంలో ముగ్గురు కరోనాతో మృతి చెందారు.నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున కరోనాతో చనిపోయారు.తూర్పుగోదావరి, కడప,కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున చనిపోయారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,286కి చేరుకొంది.
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం-1,57,716, మరణాలు 1093
చిత్తూరు-2,45,501, మరణాలు1933
తూర్పుగోదావరి-2,92,737, మరణాలు 1288
గుంటూరు -1,77,170,మరణాలు 1226
కడప -1,15,304, మరణాలు 642
కృష్ణా -1,18,375,మరణాలు 1404
కర్నూల్ - 1,24,077,మరణాలు 852
నెల్లూరు -1,45,904,మరణాలు 1049
ప్రకాశం -1,38,106, మరణాలు 1112
శ్రీకాకుళం-1,22,843, మరణాలు 785
విశాఖపట్టణం -1,57,188, మరణాలు 1123
విజయనగరం -82,855, మరణాలు 670
పశ్చిమగోదావరి-1,78,451, మరణాలు 1109
: 14/10/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,56,227 పాజిటివ్ కేసు లకు గాను
*20,35,353 మంది డిశ్చార్జ్ కాగా
*14,286 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 6,588 pic.twitter.com/7bruNpRuOz