కుప్పంలో చంద్రబాబుపై పోటీ: హీరో విశాల్ కాదు, వైసీపీ అభ్యర్ధి ఈయనే....

By narsimha lodeFirst Published Jun 30, 2022, 3:09 PM IST
Highlights


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి చెప్పారు. ఈ స్థానం నుండి హీరో విశాల్ ను  బరిలోకి దింపుతారనే ప్రచారంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టత ఇచ్చారు. 


కుప్పం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ స్థానం నుండి భరత్ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి Peddireddy Ramachandra Reddy తేల్చి చెప్పారు.

Kuppam అసెంబ్లీ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో సినీ నటుడు Vishal ను YCP అభ్యర్ధిగా బరిలోకి దింపుతారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ ప్రచారానికి చెక్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటనతో చెక్ పడింది. కుప్పం అసెంబ్లీ స్థానంలోవచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ పట్టుదలగా ఉంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. కుప్పం మున్సిపాలిటీని కూడా వైసీపీ పాగా వేసింది. దీంతో వచ్చే ఎన్నికల్లో Chandrababunaiduను  ఓడించడమే లక్ష్యంగా  జగన్ పార్టీ ప్లాన్ చేస్తోంది. 

also  read:కుప్పంలో టీడీపీ నేత ఇంటిపై మద్యం బాటిళ్లు, రాళ్లతో దాడి.. వైసీపీ కార్యకర్తల పనే..

ఈ తరుణంలోనే తమిళం మాట్లాడే వారు ఎక్కువగా ఉన్నందున సినీ నటుడు విశాల్ ను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగింది.ఈ  ప్రచారంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టత ఇచ్చారు. భరత్ ను ఈ స్థానంలో బరిలోకి దింపుతామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తేల్చి చెప్పారు. 2014, 2019 ఎన్నికల్లో భరత్ తండ్రి రిటైర్డ్ IAS అధికారి చంద్రమౌళి పోటీ చేశారు.  రెండు దఫాలు చంద్రమౌళి ఓటమి పాలయ్యాడు. ఇటీవలనే అనారోగ్యంతో చంద్రమౌళి మరణించారు.  దీంతో వైసీపీ  కుప్పం అసెంబ్లీకి ఇంచార్జీగా చంద్రమౌళి తనయుడు భరత్ ను  ఆ పార్టీ ప్రకటించింది.  వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుపై భరత్ పోటీ చేస్తారనే విషయమై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ  క్లారిటీ ఇచ్చారు. 

కుప్పం అసెంబ్లీ స్థానంలో TDP  కోటను బద్దలు కొట్టాలని వైసీపీ ప్లాన్ చేస్తుంది. ఈ స్థానంలో చంద్రబాబును ఓడించాలని వైసీపీ నాయకత్వం కంకణం కట్టుకుంది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలు కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు.ఈ ఎన్నికల్లో టీడీపీ ఆశించిన స్థాయిలో విజయాలను నమోదు చేయలేకపోయింది. చంద్రబాబు నాయుడు ఇంచార్జీలుగా నియమించిన  గౌనివారి శ్రీనివాసులుతో పాటు మరికొందరిపై క్షేత్రస్థాయి క్యాడర్ చంద్రబాబుకు పలు ఫిర్యాదు చేసినా కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే కుప్పంలో టీడీపీకి వ్యతిరేకమైన పలితాలు వచ్చాయని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయంతో ఉన్నారు.

1983 నుండి ఈ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్ధులే విజయం సాధిస్తున్నారు. 1989 నుండి ఈ స్థానం నుండి చంద్రబాబు పోటీ చేసి విజయం సాధిస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఒక్క రౌండ్ లో వెనుకబడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ  స్థానాలు దక్కించుకొంది.  ఈ ఉత్సాహంతో వైసీపీ నాయకత్వం వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు చెక్ పెడుతామనే విశ్వాసంతో ఉంది. 

కుప్పంలో మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా  మెజారిటీ ఎంపీటీసీ, జడ్పీటీసీలు వైసీపీ గెలుచుకోవడంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించే బాధ్యతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబుకు మధ్య చాలాకాలంగా వైరం కొనసాగుతుంది. ఇదిలా ఉంటే వచ్చే  ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానని కూడా చంద్రబాబు సవాల్ విసిరారు.

click me!