స్పీకర్ సీతారాంకి అభినందలు చెప్పడానికి వస్తూ ప్రమాదం..

Published : Jun 13, 2019, 08:56 AM ISTUpdated : Jun 13, 2019, 09:15 AM IST
స్పీకర్ సీతారాంకి అభినందలు చెప్పడానికి వస్తూ ప్రమాదం..

సారాంశం

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారం ఏకగ్రీవమైన సంగతి తెలసిందే. కాగా... ఆయన అభినందనలు చెప్పడానికి వస్తూ... ఆయన అభిమానులు ఇద్దరు ప్రమాదానికి గురయ్యారు. 

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారం ఏకగ్రీవమైన సంగతి తెలసిందే. కాగా... ఆయన అభినందనలు చెప్పడానికి వస్తూ... ఆయన అభిమానులు ఇద్దరు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికవుతున్న తమ్మినేని సీతారామ్‌కు అభినందనలు తెలిపేందుకు శ్రీకాకుళం జిల్లా నుంచి రెండు బస్సులు, కార్లలో  వైసీపీ నేతలు, అభిమానులు బుధవారం అర్ధరాత్రి బయలుదేరారు. 

ఈ తెల్లవారుజామున తుని పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం ధర్మాపురానికి చెందిన పప్పల నారాయణమూర్తి(69), గోరింట గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ బీఎల్‌ నాయుడు(55) అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌ను తుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP