టీడీపీకి షాక్:జనసేన తీర్థం పుచ్చుకున్న చదలవాడ

By Nagaraju TFirst Published Oct 18, 2018, 11:23 AM IST
Highlights

టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి టీడీపీకి షాక్ ఇచ్చారు. టీడీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిత్లీ తుఫాన్ బాధితులను పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా చదలవాడ కృష్ణమూర్తి పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

శ్రీకాకుళం: టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి టీడీపీకి షాక్ ఇచ్చారు. టీడీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిత్లీ తుఫాన్ బాధితులను పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా చదలవాడ కృష్ణమూర్తి పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

గత కొంతకాలంగా చదలవాడ కృష్ణమూర్తి జనసేన పార్టీలోకి చేరతారంటూ ప్రచారం జరిగింది. చదలవాడ తెలుగుదేశం పార్టీ నుంచి తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలని భావించారు. తన మనసులోని మాటను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. అయితే చంద్రబాబు చదలవాడకు ఎలాంటి హామీ ఇవ్వకలేదు. దీంతో చదలవాడ జనసేన పార్టీలోకి చేరాలని భావించారు. ఈ నేపథ్యంలో గతంలో హైదరాబాదా్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చదలవాడ కలిశారు. దసరా పర్వదినాన పార్టీ తీర్థం పుచ్చుకుంటానని చెప్పారు. అందులో భాగంగా గురువారం జనసేనలోకి చేరారు.

పవన్ కళ్యాణ్ లక్ష్యాలు, ఆయన ఆలోచన విధానం నచ్చే జనసేన పార్టీలో చేరినట్లు చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. పవన్ ఆశయ సాధనే లక్ష్యంగా తాను పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ప్రజల తలరాతలను మార్చే డైనమిక్ లీడర్ పవన్ కళ్యాణ్ మాత్రమేనని తెలిపారు. 

మరోవైపు చదలవాడ కృష్ణమూర్తి తమ కుటుంబానికి ఎంతో ఆత్మీయుడని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర రాజకీయాలపైనా, అవినీతిపైనా విసుగు చెంది మార్పు కోసం జనసేన పార్టీలోకి చేరినట్లు  స్పష్టం చేశారు. చదలవాడ మంచి మనసున్న వ్యక్తి అని ఆయనతో కలిసి పనిచెయ్యడం ఆనందంగా ఉందన్నారు. 

click me!