గౌతమ్ రెడ్డి భౌతికకాయం రాత్రికి నెల్లూరు తరలింపు .. ఎల్లుండి అంత్యక్రియలు

Published : Feb 21, 2022, 11:05 AM IST
గౌతమ్ రెడ్డి భౌతికకాయం రాత్రికి నెల్లూరు తరలింపు .. ఎల్లుండి అంత్యక్రియలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) ఎల్లుండి నెల్లూరు జిల్లాలోని సొంతూరు బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈరోజు రాత్రికి నెల్లూరు జిల్లాకు గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని తరలించనున్నారు.   

ఆంధ్రప్రదేశ్ మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) ఈ రోజు హఠాన్మరణం చెందారు. ఈ ఉదయం గుండెపోటుతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరిన గౌతమ్ రెడ్డి చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆస్పత్రికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. మరికాసేపట్లలోనే గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించనున్నారు. 

అనంతరం ఈరోజు రాత్రికి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ఆయన సొంత జిల్లా నెల్లూరు తరలించనున్నారు. ఎల్లుండి నెల్లూరు జిల్లాలోని సొంతూరు బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు అర్జున్ రెడ్డి విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.   

ప్రభుత్వ లాంఛనాలతో మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. గౌతమ్ రెడ్డి మరణంతో ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలను ప్రకటించింది. 

మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) ఈ రోజు హఠాన్మరణం చెందారు. ఈ ఉదయం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన గౌతమ్ రెడ్డి చికిత్స పొందుతూ కన్నుమూశారు. వారం రోజుల దుబాయ్ పర్యటన ముగించుకుని నిన్ననే గౌతమ్ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్నారు. గౌతమ్ రెడ్డికి గుండె పోటు రావడంతో ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. గౌతమ్ రెడ్డి మరణించిన విషయాన్ని వైద్యులు ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో మేకపాటి కుటుంబంతో పాటు, వైసీపీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. 

గౌతమ్ రెడ్డి 1971 నవంబర్ 2వ తేదీన గౌతమ్ రెడ్డి జన్మించారు. ఆయన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తనయుడు. గౌతమ్ రెడ్డి  స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండం బ్రాహ్మణపల్లి. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో గౌతమ్ రెడ్డి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. వైసీపీ ఆరంభం నుంచి మేకపాటి కుటుంబం వైఎస్ జగన్‌తోనే ఉంది. నెల్లూరు జిల్లా నుంచి పారిశ్రామిక వేత్తగా ఉన్నారు. 

మేకపాటి గౌతమ్ రెడ్డి 2014లో రాజకీయ ప్రవేశం చేశారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి వైసీపీ తరఫున బరిలో నిలిచిన గౌతమ్ రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం వైఎస్ జగన్ కేబినెట్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఆయనకు గుండెపోటు రావడంతో.. ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించింది. ఆయన మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, పలువరు రాజకీయ ప్రముఖులు ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?