Mekapati Goutham Reddy death : హైదరాబాద్ బయల్దేరిన వైఎస్ జగన్

Published : Feb 21, 2022, 11:00 AM ISTUpdated : Feb 21, 2022, 11:05 AM IST
Mekapati Goutham Reddy death : హైదరాబాద్ బయల్దేరిన వైఎస్ జగన్

సారాంశం

మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడనుంచి హైదరాబాద్ బయల్దేరారు. 

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైయస్ Jaganmohan reddy హైదరాబాద్ కు రానున్నారు. మంత్రి గౌతమ్ రెడ్డి మరణవార్త తెలుసుకున్న సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి Mekapati Goutham Reddy గుండెపోటుతో హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 8.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. వైద్యులు గౌతమ్ రెడ్డిని ఐసియులో చేర్చి అత్యవసర సేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు.

నగరి ఎమ్మెల్యే roja మేకపాటి గౌతమ్ రెడ్డిమృతిపై సంతాపం వ్యక్తం చేశారు. అస్సలు ఈగోలేని మనిషని.. ఆయన మరణం కుటుంబానికే కాదు వైసీపీ ప్రభుత్వానికి, రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. జగన్ కు చాలా , చిన్ననాటి స్నేహితుల్లా, కజిన్స్ లా చాలా ఆప్యాయంగా, ఆత్మీయంగా ఉండేవారని.. ఆయన ఈ మరణాన్ని ముఖ్యమంత్రి ఎలా తట్టుకుంటారో మాటల్లో చెప్పలేనని ఆమె చెప్పుకొచ్చారు. 

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఆయన మరణం చాలా బాధాకరం అన్నారు. ఏపీ లో పెట్టుబడుల కోసం పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రిగా  మంత్రి గౌతమ్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. 

నిన్నటి వరకు కూడా రాష్ర్టంలో  పెట్టుబడుల కోసం దుబాయ్ లో పర్యటించిన మేకపాటి గౌతంరెడ్డి ఇక లేరు అనే వార్త కలచి వేసిందని శాసనమండలికి హాజరైన సందర్భంలో ఆయనతో తనకు ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు సోమువీర్రాజు. ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శ వంతమైన రాజకీయ నేతను కోల్పోయిందని. మేకపాటి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నానన్నారు. 

మంత్రి గౌతమ్ రెడ్డి మృతి పట్ల మంత్రి పేర్నినాని సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్మరణంతో  షాక్ కు గురయ్యాం. మేకపాటి గౌతమ్ రెడ్డి నాకు మంచి స్నేహితుడు,ఆయన మరణం రాష్ట్రానికి, మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు చిన్న వయసులో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా తన మార్క్ చూపించారు..ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని కోరుతున్నా వారి కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా నన్నారు. 

కాగా, మేకపాటి మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. Gautam Reddy గారి హఠాన్మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ టీడీపీ అధినేత Chandrababu naidu ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. 

మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యాను. ఫిట్నెస్‌కి అత్య‌ధిక ప్రాధాన్యం ఇచ్చే మంత్రి గారికి గుండెపోటు రావ‌డం అత్యంత విచార‌క‌రం. విదేశాల‌లో ఉన్న‌త‌ విద్యాభ్యాసం చేసి వ‌చ్చినా విన‌యం, విధేయ‌త‌లు ఆయ‌న చిరునామా. ఐదుప‌దుల వ‌య‌స్సులోనే హుందా గ‌ల రాజ‌కీయ‌వేత్త‌గా పేరుగాంచిన మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి మ‌న‌కి దూరం కావ‌డం తీర‌ని విషాదం. మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్రగాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి nara lokesh సంతాపం వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?