మంత్రి మేకపాటి డిల్లీకి పయనం... కేంద్ర మంత్రి ధర్మేంద్రతో కీలక సమావేశం

By Arun Kumar PFirst Published Jun 15, 2021, 2:38 PM IST
Highlights

ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ పర్యటనతో కేంద్ర ప్రభుత్వంలో మెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు విషయంలో కదలిక వచ్చింది. 

 అమరావతి: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఢిల్లీకి పయనమవుతున్నారు. కాకినాడ సెజ్ లో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుపై చర్చించడం కోసం మంత్రి మేకపాటి ఢిల్లీ వెళ్తున్నారు. ఇందుకోసం మంగళవారం సాయంత్రం బయలుదేరి రాత్రి ఢిల్లీకి చేరన్నారు. 

ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ పర్యటనతో కేంద్ర ప్రభుత్వంలో మెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు విషయంలో కదలిక వచ్చింది. బుధవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో కూడిన ప్రత్యేక బృందం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో మెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుపై సమావేశం కానుంది. 

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు కాకినాడ సెజ్లో పెట్రో కాంప్లెక్స్ స్థాపనకై ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అనంతరం కీలక అడుగుపడింది. ఇందుకు సంబంధించి ముఖ్యమైన సమావేశాన్ని కేంద్రం బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో పూర్తి వివరాలతో కూడిన ప్రజెంటేషన్ ను కేంద్ర మంత్రికి రాష్ట్ర అధికారులు వివరించనున్నారు. 

read more  పౌరుషం ఉంటే ఈటల మాదిరిగా రాజీనామా చేయాలి: రఘురామపై భరత్ విమర్శలు

ఏపీలో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ విషయంలోనూ ధర్మేంద్ర ప్రధాన్‌ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.ఈ క్రమంలోనే విధివిధానాలను ఖరారుకు పరిశ్రమల మంత్రితో పాటు సీఎస్ కూడా డిల్లీకి వెళుతున్నారు. 

ఈ ప్రాజెక్టు విధివిధానాలపై చర్చించడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వర్కింగ్‌ గ్రూపు కోసం సభ్యులను నామినేట్‌ చేశామని... కేంద్ర కూడా చర్చలు ప్రారంభించేలా వెంటనే ఆదేశాలు జారీచేయాలని ముఖ్యమంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 25శాతం తగ్గించిందని... అలాగే ప్రపంచవ్యాప్తంగా వడ్డీరేట్లు కూడా తగ్గాయని వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌తో నిమిత్తంలేకుండా ప్రాజెక్టు సాధ్యం అయ్యే పరిస్థితులు ఉన్నాయని వివరించారు. వెంటనే దీనిపై దృష్టిసారించాలని కేంద్ర మంత్రి ప్రధాన్ కు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కదలిక వచ్చింది. 


 

 
 

click me!