కొంచెం బిజీగా ఉన్నా.. అందుకే స్పందిచడానికి 36గంటలు పట్టింది

First Published 5, Jul 2018, 12:26 PM IST
Highlights


*మరోసారి జీవీఎల్ పై సెటైర్లు వేసిన లోకేష్
*నా సవాల్ కి జీవీఎల్ పారిపోయారు
*మీలో సృజనాత్మకత తగ్గిందా?
 

ఏపీ రాష్ట్ర మంత్రి లోకేష్.. మరోసారి బీజేపీ నేత జీవీఎల్ పై సెటైర్లు వేశారు. ఇటీవల జీవీఎల్ లోకేష్ పై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. వాటిపై లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

భాజపా నేత జీవీఎల్ నరసింహరావుకు సవాల్ చేసిన తర్వాతైనా తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి పేర్లు బయటపెడతారని వేచి చూస్తే మళ్లీ అసత్య ఆరోపణలు చేసి పారిపోయారని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. 

ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‌కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే పనిలో తాను ఉన్నానని తెలిపారు.

 

 శాఖాపర పనుల్లో బిజీగా ఉన్న తనకు జీవీఎల్ చేసిన అసత్య ఆరోపణలపై స్పందించడానికి 36 గంటలు పట్టిందని.... పేర్లు బయటపెట్టడానికి ఖాళీగా ఉన్న జీవీఎల్‌కు ఇంత సమయం పట్టడం ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు. మీలో సృజనాత్మకత తగ్గిపోయిందా? అని జీవీఎల్‌ను లోకేశ్ ప్రశ్నించారు.

Last Updated 5, Jul 2018, 12:26 PM IST