రామతీర్ధం ఘటన.. బాబు, లోకేశ్‌లకు నార్కో టెస్టులు చేయాలి: కొడాలి నాని

By Siva KodatiFirst Published Jan 3, 2021, 3:11 PM IST
Highlights

రామతీర్థంలో రామయ్య విగ్రహం ధ్వంసం నేపధ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్న కొండ దగ్గర టీడీపీ, వైసీపీ అగ్రనేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు

రామతీర్థంలో రామయ్య విగ్రహం ధ్వంసం నేపధ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్న కొండ దగ్గర టీడీపీ, వైసీపీ అగ్రనేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు.

తాజాగా మంత్రి కొడాలి నాని సీన్‌లోకి వచ్చారు. రామతీర్థంలో నూటికి నూరుశాతం విగ్రహాన్నీ ధ్వంసం చేయించింది ప్రతిపక్ష నేత చంద్రబాబే అని నాని ఆరోపించారు.

చంద్రబాబుతో పాటుగా, లోకేష్, అశోక్ గజపతిరాజు, స్థానిక టీడీపీ నాయకులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేయిస్తే వాస్తవాలు బయటకొస్తాయని మంత్రి సూచించారు.

దేవుడు లాంటి ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, దేవుడు అన్నా, ప్రజాస్వామ్యం అన్నా నమ్మకం లేదని నాని ధ్వజమెత్తారు. స్వార్థ రాజకీయాల కోసమే రామతీర్థంలో చంద్రబాబు ‘డేరా బాబా’ అవతారం ఎత్తారని దుయ్యబట్టారు. 

రాజకీయాల్లో దేవుళ్లను అడ్డం పెట్టుకుని బతికే నీచ స్థితికి చంద్రబాబు దిగజారిపోయారని నాని దుయ్యబట్టారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేష్.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఛాలెంజ్ విసరడం విడ్డూరమన్నారు.

దొడ్డి దారిన మూడు మంత్రి పదవులు వెలగబెట్టి, జగన్‌మోహన్‌రెడ్డి పెట్టిన అభ్యర్ధి చేతిలో ఓడిపోయాడంటూ లోకేష్‌పై సెటైర్లు వేశారు. ప్రజల తిరస్కారానికి గురైన బఫూన్, జోకర్ లాంటి లోకేష్ ఛాలెంజ్‌ను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్వీకరించాలనడం హాస్యాస్పదమన్నారు.

లోకేష్ పిచ్చివాగుడు కట్టి పెట్టకపోతే సహించేది లేదని, సీఎం గురించి మాట్లాడితే సహించబోమని కొడాలి నాని వార్నింగ్ ఇచ్చారు.

click me!