ఏపీలో కూడా టీడీపీకి తెలంగాణలో పట్టిన గతే: అసెంబ్లీలో బాబుపై కొడాలి నాని ఫైర్

By narsimha lode  |  First Published Mar 23, 2022, 11:53 AM IST


తెలంగాణలో పట్టిన గతే ఏపీ రాష్ట్రంలో కూడా టీడీపీకి పడుతుందని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో కొడాలి నాని ప్రసంగించారు.


అమరావతి:తెలంగాణలో ఏ గతి పట్టిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టీడీపీకి అదే గతి పడుతుందని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు.

 బుధవారం నాడు AP అసెంబ్లీలో  TDP సభ్యులు చిడతలు వాయించిన ఘటనపై  Speaker  ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయమై ఏపీ మంత్రి Kodali Nani కూడా ప్రసంగించారు. ప్రస్తుతం అసెంబ్లీలో నిరసనకు దిగిన టీడీపీ సభ్యులు కూడా చాలా నెమ్మదస్తులన్నారు.  Chandrababu పోరు పడలేక Assembly లో వారంతా చిడతలు వాయిస్తున్నారన్నారు. అసెంబ్లీ బయట ఉన్న  చంద్రబాబును చూసి భయపడి టీడీపీ సభ్యులు అసెంబ్లీలో నిరసనకు దిగుతున్నారన్నారు. బాబుకు భయపడకుండా సభా కార్యక్రమాలు నిర్వహించేందుకు సహకరించాలని మంత్రి కోరారు.

Latest Videos

undefined

మద్యం గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు.  వారుణి వాహిని పేరుతో సారాయిని ప్యాకెట్ల రూపంలో విక్రయించిన చరిత్ర టీడీపీదేనని  కొడాలి నాని గుర్తు చేశారు. NTR మద్య నిషేధం అమలు చేస్తే  చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మద్య నిషేధం ఎత్తివేశాడన్నారు. 

అంతేకాదు రాష్టరంలో 240 మద్యం బ్రాండ్లకు కూడా అనుమతిని ఇచ్చిన చరిత్ర చంద్రబాబుదేనని  కొడాలి నాని చెప్పారు. 2019  ఎన్నికలకు ముందు  రాష్ట్రంలో బార్లకు 20 ఏళ్ల పాటు అనుమతిని ఇచ్చారని నాని గుర్తు చేశారు. అలాంటి పారటీ ఇప్పుడు మద్యం గురించి మాట్లాడుతున్నారని నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. 

ఏ పార్టీతో పొత్తుపెట్టుకుంటే తమకు కలిసి వస్తోందోనని చంద్రబాబు ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కానీ టీడీపీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకొన్నా ఆ పార్టీ కూడా సర్వ నాశనం అవుతుందని నాని చెప్పారు. చంద్రబాబును పార్టీ మారాలని టీడీపీ సభ్యులు ఒత్తిడి తేవాలన్నారు. లేదా టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలైనా పార్టీ మారాలని మంత్రి నానికి సూచించారు. శాసనసభ సజావుగా సాగేందుకు సహకరించాలని కూడా మంత్రి నాని టీడీపీ సభ్యులను కోరారు.

జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చకు ఇవాళ కూడా ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. చడతలు పట్టుకొని నిరసనకు దిగారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేయాలని పలువురు వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గించడంపై స్పీకర్ టీడీపీ సభ్యుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సాగుతున్న తరుణంలో జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ సభ్యులు పట్టుబడుతున్నారు.ప్రతి రోజూ అసెంబ్లీలో నిరసనకు దిగుతూనే ఉన్నారు. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు సెషన్ మొత్తం సస్పెండ్ అయ్యారు. గత వారంలో ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. నిన్న నలుగురు టీడీపీ సభ్యులను  సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. అంతేకాదు ప్రతి రోజూ సభలో నిరసనలకు దిగిన టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. ఇవాళ కూడా టీడీపీ సభ్యలు సభ ప్రారంభైన వెంటనే నిరసనకు దిగారు. 

click me!