కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం గుంట కోడూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు.
గుడివాడ: తనకు74 ఏళ్ల వయసు, నలబై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కులాలు, మతాలను అంటగట్టడం ఆయన దిగజారుడుతనానికి అద్దంపడుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు హోంమంత్రి, డిజిపి, ఎస్పి క్రిస్టియన్లు అంటూ చంద్రబాబు మాట్లాడడం సిగ్గు చేటని అన్నారు.
కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం గుంట కోడూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికారులు కులాలు మతాల వారీగా పని చేయరన్నారు. వారు ఉద్యోగంలో చేరే సమయంలో అన్ని వర్గాల ప్రజల కోసం పని చేస్తామని ప్రమాణం చేసి విధులలోకి వస్తారని అన్నారు. చంద్రబాబు లాంటి నీచులు ఉంటారని రాజ్యాంగంలో ఇటువంటి నిబంధనలు ఉన్నాయన్నారు.
undefined
''ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధ్యతలు తీసుకునేటప్పుడు కుల, మత, రాగద్వేషాలకు, అతీతంగా పని చేస్తామని ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కానీ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను అదునుగా చేసుకుని చంద్రబాబు నాయుడుకు, పప్పు నాయుడు రాజకీయ లబ్ది కోసం ఇటువంటి డ్రామాలు అడుతున్నారు. కానీ రాష్ట్రంలో ప్రజలు దీన్ని గమనిస్తున్నారు'' అన్నారు.
read more బాబు వస్తుంటే.. సాయిరెడ్డిని ఎలా రానిచ్చారు: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
''చంద్రబాబు నాయుడును హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఇలా రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఆదరించ బట్టే నలబై సంవత్సరాల నుండి రాజకీయాలలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన తెలుసుకోవాలి. ఎలాగైనా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో ఉచ్చనీచాలు లేకుండా రాష్ట్రంలో మతాల మధ్య కులాల మధ్య చంద్రబాబు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు'' అని ఆరోపించారు.
''ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు కాదు... అంతా గమనించబట్టే చంద్రబాబు నాయుడుకు ఈ రోజు ఈ గతి పట్టింది. ఆయన చేసే నీచ రాజకీయాలను చూస్తున్న ప్రజలు అతన్నీ ఇంకా పాతాళానికి భూస్థాపితం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి భగవంతునితో పాటు వైయస్సార్ ఆశీస్సులున్నాయి'' పేర్కొన్నారు.
''సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ పాలన చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. వాటిని తిప్పి కొట్టలసిన అవసరం మాతో పాటు ప్రజలకు ఉంది'' అని మంత్రి కొడాలి నాని అన్నారు.