అసెంబ్లీ కాదు.. ఆ మీటింగ్ లు పెట్టుకోండి: లోకేష్ పై కొడాలి నాని సెటైర్లు

By Arun Kumar PFirst Published Nov 30, 2020, 12:55 PM IST
Highlights

ప్రజా సమస్యలపై చర్చించాల్సి వున్నందున కనీసం పదిరోజులయినా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న టిడిపి వాదనపై మంత్రి కొడాలి నాని స్పందించారు. 

అమరావతి: శాసన సభ శీతాకాల సమావేశాలు ఐదు రోజులు మాత్రమే నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష టిడిపి వ్యతిరేకిస్తోంది. అనేక ప్రజా సమస్యలపై చర్చించాల్సి వున్నందున కనీసం పదిరోజులయినా సమావేశాలు నిర్వహించాలని ఆ పార్టీ నాయకులు కోరుతున్నారు. దీనిపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ అన్ని సమస్యలపై చర్చించేందుకు ఐదురోజులు సరిపోతాయన్నారు. అయితే తండ్రీ కొడుకులకు(చంద్రబాబు, లోకేష్) సరిపోకపోతే జూమ్ లో మీటింగ్ లు పెట్టుకోవాలని మంత్రి నాని సెటైర్లు విసిరారు. 

అసెంబ్లీ సమావేశాలకు ముందు మంత్రి నాని మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నానిపై జరిగిన హత్యాయత్నంపై  కూడా స్పందించారు. ఈ దాడిని తాను ఖండిస్తున్నానని అన్నారు. వైసిపి నాయకులందరం తమ భద్రత కంటే ప్రజల భద్రతకే అదిక ప్రాదాన్యత ఇస్తున్నామన్నారు. అందువల్లే ఎలాంటి భద్రత లేకుండా ప్రజల్లోకి వెళుతున్నామని... ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు. 

read more  ఏపీ అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై రగడ: టీడీపీ వాకౌట్

సోమవారం శాసన సభ శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్బంగా సభలో చర్చించాల్సిన అంశాలు, ప్రవేశపెట్టాల్సిన బిల్లులు ఇలా వివిధ అంశాలపై చర్చించేందుకు బిఎసి సమావేశం జరిగింది. 5 రోజుల పాటు అంటే డిసెంబర్ 4వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో 19 బిల్లులను ప్రవేశ పెట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే 21 ఎజెండా అంశాలను అధికార వైసిపి ప్రతిపాదించింది. 

అయితే ఈ సమావేశంలో ప్రతిపక్ష టిడిపి తరపున పాల్గొన్న ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు 20అంశాలపై చర్చ జరపాలని పట్టుబట్టాడు. కనీసం 10రోజుల పాటైనా సభ జరపాలని తాను ప్రతిపాదించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలు అనేకం ఉన్న దృష్ట్యా వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు, పరిష్కరించేలా చేసేందుకు 5రోజుల వ్యవధి ఎందుకూ సరిపోదన్నారు. టిడిపి లేవనెత్తిన 20అంశాలపై చర్చ జరగాల్సిందేనని అచ్చెన్నాయుడు పట్టుబట్టారు. 
 

click me!