దళితులపై అనుచిత వ్యాఖ్యలు.. జనమే తిరగబడ్డారు, వైసీపీకి సంబంధం లేదు: దేవినేని ఇష్యూపై కొడాలి నాని స్పందన

By Siva KodatiFirst Published Jul 28, 2021, 4:48 PM IST
Highlights

పోలీసులను దేవినేని ఉమ బెదిరించారని.. గ్రామస్తులను కావాలనే దేవినేని ఉమా రెచ్చగొట్టారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఎస్సీలను, పోలీసులను దేవినేని ఉమ దుర్భాషలాడారని.. వైసీపీ నేత కారు అద్దాలను ఉమ అనుచరులు ధ్వంసం చేశారని మంత్రి తెలిపారు.

మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై దాడి ఘటనపై స్పందించారు మంత్రి కొడాలి నాని. బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ నేతలు లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేవినేని ఉమ అరాచకాలతో ప్రజలు విసిగిపోయి తిరగబడ్డారని ఆయన స్పష్టం చేశారు. దేవినేని వ్యాఖ్యలతో జనమే తిరగబడ్డారని నాని అన్నారు. పోలీసులను దేవినేని ఉమ బెదిరించారని.. గ్రామస్తులను కావాలనే దేవినేని ఉమా రెచ్చగొట్టారని నాని ఆరోపించారు.

ఎస్సీలను, పోలీసులను దేవినేని ఉమ దుర్భాషలాడారని.. వైసీపీ నేత కారు అద్దాలను ఉమ అనుచరులు ధ్వంసం చేశారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని ఆపేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని కొడాలి ఆరోపించారు. వైఎస్ఆర్‌సీపీపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని...మా కార్యకర్తలపై దాడి చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాని మండిపడ్డారు.

Also Read:దేవినేని ఉమాపై దాడి వెనుక పోలీసుల హస్తం: ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

పబ్లిసిటీ కోసం ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. రాష్ట్రంలో అవినీతి చక్రవర్తి, వెన్నుపోటుదారుడు చంద్రబాబు అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని నాని డిమాండ్ చేశారు. వసంత కృష్ణప్రసాద్‌పై దేవినేని ఉమావి నిరాధారమైన ఆరోపణలు అంటూ నాని మండిపడ్డారు. 2014-2019 వరకు అత్యధిక మైనింగ్ జరిగిన ప్రాంతం ఇదేనని నాని తెలిపారు. 

click me!