విజయవాడలో ఘోరం... ప్రేమ వలలో పడి యువతి బలి

Arun Kumar P   | Asianet News
Published : Jul 28, 2021, 04:00 PM IST
విజయవాడలో ఘోరం...  ప్రేమ వలలో పడి యువతి బలి

సారాంశం

ప్రేమిస్తున్నానంటూ వెంటపడిన ఓ ఆకతాయిని నమ్మి ఓ యువతి అతి దారుణంగా హత్యకు గురయింది. ఈ దారుణ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 

విజయవాడ: ప్రేమిస్తున్నానంటూ యువతి వెంట పడ్డాడు. అతడి మాటలు నమ్మి అతడి ప్రేమ వలలో పడి చివరకు ప్రాణాలు కోల్పోయింది. బంగారు నగలకోసం యువతిని నదిలోకి తోసేసి అతి కిరాతకంగా హతమార్చాడు దుండగుడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... విజయవాడ చిట్టినగర్ ప్రాంతంలో ఓ యువతి(21) కుటుంబంతో కలిసి నివాసముండేది. అయితే ఆ యువతిపై కన్నేసిన యువకుడు ప్రేమ పేరిట వెంటపడి ట్రాప్ చేశాడు. యువతిని నమ్మించి తన వలలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల పదో తేదీన యువతి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అయితే యువతికోసం అంతటా వెతికినా లాభం లేకపోవడంతో కొత్తపేట పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

read more  పెళ్లైన వాడితో ప్రేమ.. పెద్దలు అంగీకరించలేదని..!

అయితే తన కూతురిని ఎత్తుకెళ్లిన యువకుడు యూపీలో వున్నట్లు తెలుసుకున్న యువతి తండ్రి స్నేహితులతో కలిసి అతన్ని పట్టుకోడానికి వెళ్లాడు. ఉత్తరప్రదేశ్ లోని సహరంపూర ప్రాంతంలో యువకున్ని పట్టుకున్న యువతి తండ్రి అక్కడి పోలీసులకే అప్పగించారు.

పోలీసుల విచారణలో సదరు యువకుడు సంచలన నిజాలు బయటపెట్టాడు. యువతిని నదిలో తోసి హత్య  చేసినట్టు యువకుడు ఒప్పుకున్నాడు. యువతికి సంబంధించిన బంగారం కూడా అతని వద్దే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్