
యలమర్రు తమ పూర్వీకుల గ్రామమన్నారు మంత్రి కొడాలి నాని. మా నాన్న, నేను గుడివాడలోనే పుట్టామని నాని స్పష్టం చేశారు. యలమర్రు రాజకీయాలు తనకు తెలియదని.. యలమర్రులో తాను ఓట్లు అడిగినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని నాని సవాల్ విసిరారు.
కాగా, మంత్రి నాని స్వగ్రామంలో తెలుగు దేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి ఘన విజయం సాధించారు. కొడాలి నాని స్వగ్రామం గుడివాడ నియోజకవర్గం పామర్రు మండలం యలమర్రు గ్రామంలో సర్పంచ్‌గా టీడీపీ బలపరిచిన అభ్యర్థి కొల్లూరి అనూష 800 ఓట్లతో భారీ మెజారిటీతో విజయం సాధించారు.
Also Read:కొడాలి నానిపై కేసుకి ఎస్ఈసీ ఆదేశాలు: న్యాయ సలహాకి పంపిన కృష్ణా జిల్లా పోలీసులు
యలమర్రు గ్రామంలో మొత్తం 12 వార్డులకు గాను, 11 వార్డులను టీడీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. అధికార వైసీపీ కేవలం ఒక్క వార్డుకే పరిమితమైంది. ఈ క్రమంలోనే కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు.
ఇక కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుడివాడ నియోజకవర్గంలో జనసేన జెండా కూడా ఎగిరింది. గుడ్లవల్లేరు నియోజకవర్గం వెణుతురుమిల్లిలో జనసేన బలపర్చిన కొప్పునేని శేషవేణి 173 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం గమనార్హం