420, చంద్రబాబును ఎన్టీఆర్ చెప్పుతో కొట్టారు: కొడాలి నాని తిట్ల దండకం

Siva Kodati |  
Published : Jan 25, 2022, 05:58 PM IST
420, చంద్రబాబును ఎన్టీఆర్ చెప్పుతో కొట్టారు: కొడాలి నాని తిట్ల దండకం

సారాంశం

కృష్ణా జిల్లా గుడివాడ క్యాసినో (Guidivada Casino Issue) వ్యవహారంపై ఏపీలో రాజకీయం మరింత ముదురుతోంది. అటు ప్రతిపక్షాలు ఇటు మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. టీడీపీ (TDP), బీజేపీ (BJP) నేతల కామెంట్స్ కు కొడాలి నాని తనదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు.

కృష్ణా జిల్లా గుడివాడ క్యాసినో (Guidivada Casino Issue) వ్యవహారంపై ఏపీలో రాజకీయం మరింత ముదురుతోంది. అటు ప్రతిపక్షాలు ఇటు మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. టీడీపీ (TDP), బీజేపీ (BJP) నేతల కామెంట్స్ కు కొడాలి నాని తనదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుడివాడలో ఏదో జరిగిపోయిందంటూ టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారం ట్రాప్ లో బీజేపీ నేతలు పడుతున్నారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. సోము వీర్రాజు (somu verraju) .. టీడీపీ ప్రచారం నుంచి బయటకురావాలంటూ చురకలు వేశారు. బీజేపీ అధికారంలో ఉన్న గోవాలో క్యాసినోలు నిర్వహిస్తున్నారని.. ముందు అక్కడికెళ్లి నిలదియాలని డిమాండ్ చేశారు. అక్కడ క్యాసినోలు ఎందుకు బ్యాన్ చేయలేదో చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. సోము వీర్రాజు.. టీడీపీ అజెండాను భుజానికెత్తుకున్నారని మంత్రి విమర్శించారు. బీజేపీని టీడీపీ బీ గ్రూప్ గా తయారు చేయొద్దని ... సోము వీర్రాజు దగ్గర పాఠాలు నేర్చుకొని డిపాజిట్లు కోల్పోయే స్థితికి రాలేమంటూ సెటైర్లు వేశారు.

ఓ మంత్రి మీద ఆరోపణలు చేసేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని సూచించారు. తామేమీ మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం లేదంటూ దుయ్యబట్టారు. సోము వీర్రాజు డ్రెసింగ్, స్టైల్, ఆహార్యం అంతా బావుటుందని.. కానీ ఆయన మెదడులోనే సమస్య ఉందని.. దాన్ని బాగుచేయించుకుంటే మంచిదంటూ కొడాలి నాని సెటైర్లు వేశారు. సోము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే బీజేపీ పరిస్థితి మెరుగు పడుతుందని సూచించారు.

టీడీపీ నేత వర్ల రామయ్య (varla ramaiah).. తనను లాకప్ లో వేసి కుమ్మారంటూ బుద్ధా వెంకన్న (buddha venkanna) చేసిన కామెంట్స్ కు నాని కౌంటర్ ఇచ్చారు. వర్ల రామయ్య పోలీస్ గా గుడివాడలో పనిచేసిన సయమంలో తాను స్కూల్లో చదువుకుంటున్నానని.. అప్పుడు నన్ను ఎలా లాకప్ లో వేసి కొడతారని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు.. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎలాంటి అనుమతులు లేకుండా జూదశాలలు నిర్వహించారని మంత్రి ఆరోపించారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ నిందితులతో తనపై ఆరోపణలు చేస్తున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విజయవాడలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ బాధితులు త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నారని.. ప్రతి ఒక్కరికీ బడిత పూజ ఉంటుందని కొడాలి నాని హెచ్చరించారు. చంద్రబాబు నేర చరిత్ర గురించి గంట గంటకు మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని కొడాలి నాని సవాల్ విసిరారు. చంద్రబాబు గతం గురించి ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టకపోతే తనపేరు కొడాలి నాని కాదని సవాల్ చేశారు. దీనిపై చంద్రబాబు ఎక్కడ చర్చపెట్టినా అక్కడికి రావడానికి తాను సిద్ధమంటూ వ్యాఖ్యానించారు. టీడీఎల్పీ కార్యాలయంలో పేకాట ఆడిన చరిత్ర చంద్రబాబుదని.. ఆయన్ను ఎన్టీఆర్ (ntr) చెప్పుతో కొట్టారని నందమూరి కుటుంబ సభ్యులే చెప్పారని కొడాలి నాని సంచలన ఆరోపణలు చేసారు.

PREV
click me!

Recommended Stories

Perni Nani comments on Chandrababu: చంద్రబాబు, పవన్ పేర్ని నాని సెటైర్లు | Asianet News Telugu
IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే