ఏపీలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. 24 గంటల్లో 13,819 మందికి పాజిటివ్, విశాఖలో తగ్గని జోరు

Siva Kodati |  
Published : Jan 25, 2022, 05:32 PM ISTUpdated : Jan 25, 2022, 05:33 PM IST
ఏపీలో కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. 24 గంటల్లో 13,819 మందికి పాజిటివ్,  విశాఖలో తగ్గని జోరు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు పెరుగుతూనే  వున్నాయి. గడిచిన 24 గంటల్లో 13,819 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 22,06,060కి చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు పెరుగుతూనే  వున్నాయి. గడిచిన 24 గంటల్లో 13,819 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 22,06,060కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల చిత్తూరు, తూర్పు గోదావరి, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నంలలో ఇద్దరు చొప్పున.. పశ్చిమ గోదావరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,561కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 5,716 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,90,103కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 46,929 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,22,34,226కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,01,396 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 1345, చిత్తూరు 436, తూర్పుగోదావరి 1001, గుంటూరు 1422, కడప 1083, కృష్ణ 748, కర్నూలు 1255, నెల్లూరు 1305, ప్రకాశం 1589, శ్రీకాకుళం 568, విశాఖపట్నం 1988, విజయనగరం 435, పశ్చిమ గోదావరిలలో 644 చొప్పున వైరస్ బారినపడ్డారు. 

కాగా.. భారత్‌‌లో కరోనా వైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతుంది. అయితే కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య కాస్త తగ్గడం కొంత ఊరట కలిగిస్తుంది. వరుసగా 5 రోజులుగా 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. భారత్‌లో గడిచిన 24 గంట్లలో కొత్తగా 2,55,874 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో 614 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,90,462కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. ఇక, నిన్న కరోనా నుంచి 2,67,753 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనాను జయించినవారి సంఖ్య 3,70,71,898 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 22,36,842 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ప్రస్తుతం దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు భారీగా తగ్గింది. కిందటి రోజు  20.75 శాతంగా ఉన్న పాజిటివిటీ రేట ప్రస్తుతం 15.52 శాతంకు చేరింది. మరోవైపు వీక్లీ పాజిటివిటీ రేటు 17.17 శాతానికి పెరిగింది. ఇక, దేశంలో కరోనా రికవరీ రేటు.. 93.15 శాతం, మరణాల రేటు 1.23 శాతం, యాక్టివ్ కేసుల శాతం 5.62 శాతంగా ఉంది. ఇక, సోమవారం రోజున (జనవరి 24) దేశంలో 16,49,108 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో ఇప్పటివరకు పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 71,88,02,433కి చేరింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 62,29,956 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,62,92,09,308 కి చేరింది. 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Review Meeting: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక| Asianet News Telugu
చిన్నప్పుడు రాయల్ బైక్ ఎక్కేవాణ్ణి.. చంద్రబాబు పంచ్ లు | Chandrababu Review Meeting | Asianet Telugu