పరిషత్ ఎన్నికలు పెట్టకుండా చంద్రబాబు అడ్డుపడ్డారు.. అయినా జనం జగన్ వెంటే: కన్నబాబు

Siva Kodati |  
Published : Sep 19, 2021, 07:11 PM IST
పరిషత్ ఎన్నికలు పెట్టకుండా చంద్రబాబు అడ్డుపడ్డారు.. అయినా జనం జగన్ వెంటే: కన్నబాబు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే సీఎం జగన్‌ జైత్రయాత్ర కొనసాగుతున్నట్లు అర్థమవుతోందన్నారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు . పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి 80 శాతం ఫలితాలు వచ్చాయని.. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అంతకుమించి ఫలితాలు వస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే సీఎం జగన్‌ జైత్రయాత్ర కొనసాగుతున్నట్లు అర్థమవుతోందన్నారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు . పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి 80 శాతం ఫలితాలు వచ్చాయని.. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అంతకుమించి ఫలితాలు వస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు ప్రజాబలం ఉందని చెప్పేందుకు ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు.  

Also Read:టీడీపీ పోటీలో లేదు కాబట్టి మేం గెలిచామంట: పరిషత్ ఫలితాలపై సజ్జల వ్యాఖ్యలు

2018లోనే పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా చంద్రబాబు పెట్టలేదని కన్నబాబు మండిపడ్డారు. పరిషత్‌ ఎన్నికలు పెట్టాలని చూస్తే చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడ్డారని మంత్రి ఆరోపించారు. కొందరు అడుగడుగునా అడ్డుతగిలినప్పటికీ ప్రజలు సీఎం జగన్ వెంటే నడిచారని ఆయన గుర్తుచేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైకాపా దౌర్జన్యాలు, దుర్మార్గాలకు పాల్పడినట్లు టీడీపీ ప్రచారం చేసిందని.. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా సీఎం జగన్‌కు ప్రజలు వెన్నుదన్నుగా నిలబడ్డారని కన్నబాబు వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయాన్ని చేతల ద్వారా చేసి చూపించిన వ్యక్తి సీఎం జగన్‌ అని ఇప్పటికైనా ఓటమికి కారణాలను తెలుసుకొని.. రాష్ట్ర నిర్మాణాత్మక పరిపాలనకు టీడీపీ సహకరిస్తే మంచిది అని కన్నబాబు హితవు పలికారు.  
 

PREV
click me!

Recommended Stories

నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP