పవన్ గురించి అడిగి నన్ను అవమానించొద్దు.. సీఎం జగన్ సవాలు ఆయనకు కాదు: మంత్రి  కాకాణి సంచలన వ్యాఖ్యలు.. 

Published : Mar 01, 2023, 02:18 PM IST
పవన్ గురించి అడిగి నన్ను అవమానించొద్దు.. సీఎం జగన్ సవాలు ఆయనకు కాదు: మంత్రి  కాకాణి సంచలన వ్యాఖ్యలు.. 

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ గురించి అడిగి తనను అవమానించొద్దని అన్నారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ గురించి అడిగి తనను అవమానించొద్దని అన్నారు. రెండు సార్లు ఎన్నికల్లో గెలిచిన తనను.. రెండు చోట్ల  ఓడిన పవన్ గురించి అడగొద్దని చెప్పారు. అదే విధంగా సీఎం జగన్‌ సవాలుపై స్పందించిన మంత్రి కాకాణి.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తారా? అని జగన్ చంద్రబాబును అడిగారని అన్నారు. అంతేగానీ పవన్ కల్యాణ్‌ను అడగలేదని చెప్పారు. పవన్ పార్టీని తాము గుర్తించడం  లేదని.. ఆయన స్థాయి తోలుబొమ్మలాటలో జోకర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ వేర్వేరుగా ఉండవని మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లతో కలిపే రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని  చెప్పారు. పీఎం కిసాన్‌తో కలిసి వైఎస్సార్ రైతు భరోసా ఇస్తున్నామని  తమ ప్రభుత్వం పదే పదే చెబుతుందని  అన్నారు. 

ఇక, మంగళవారం రోజున గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన సీఎం వైఎస్ జగన్.. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒంటరిగా  పోటీ చేసి గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సవాలు విసిరారు. ‘‘మీకు అన్ని స్థానాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా? నేను చేస్తాను. అన్ని సీట్లు గెలుస్తానన్న నమ్మకం ఉంది. వాళ్లకు ఆ ధైర్యం లేదు. ఎందుకంటే జీవితంలో వారు ఏ రోజు కూడా మంచి చేయలేదు. కానీ మీ బిడ్డకు ధైర్యం ఉంది.. కారణం మేం మంచి చేశాం. చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లి.. మల్లి గెలుస్తామనే నమ్మకం ఉంది’’ అని జగన్ అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం