తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు.
తిరుపతి: జిల్లాలోని సుళ్లూరుపేటలోని ఓ ఇంట్లో బుధవారం నాడు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ల పేలుడు ఘటనలు చోటు చేసుకున్నాయి. గ్యాస్ వినియోగదారుల అజాగ్రత్తగా వ్యవహరించడంతో పాటు ఇతరత్రా కారణాలతో గ్యాస్ సిలిండర్ల పేలుళ్లు జరిగాయి.
undefined
రాజస్థాన్ లోని జోథ్ పూర్‌లో భుంగ్రా గ్రామంలో పెళ్లి వేడుకలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 46 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన 2022 డిసెంబర్ 9వ తేదీన జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలోని తిప్పకట్ట వద్ద గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటన 2022 డిసెంబర్ 4వ తేదీన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
2022 అక్టోబర్ 26న సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దద్దవాడ వద్ద 2022 సెప్టెంబర్ 2న లారీలో గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్న సమయంలో లారీ ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో లారీలోని సిలిండర్లు పేలిపోయాయి. దీంతో ఈ రహదారిపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.
also read:బాపట్ల జిల్లా తిప్పకట్టలో గ్యాస్ సిలిండర్ పేలుడు: ముగ్గురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన గత ఏడాది ఆగష్టు 7వ తేదీన చోటు చేసుకుంది .2021 హైద్రాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడుతో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.