ఆయన గళం ఎందుకో, ఎవరు వింటారో : లోకేష్ పాదయాత్రపై మంత్రి కాకాణి సెటైర్లు

By Siva KodatiFirst Published Jan 20, 2023, 9:15 PM IST
Highlights

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ నిర్వహించ తలపెట్టిన యువగళం పాదయాత్రపై సెటైర్లు వేశారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఆయన గళం ఎందుకు వినిపిస్తున్నాడో, ఎవరు వింటారో చూడాలని కాకాణి సెటైర్లు వేశారు.
 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. కేవలం అధికారం కోసమే లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆయన గళం ఎందుకు వినిపిస్తున్నాడో, ఎవరు వింటారో చూడాలని కాకాణి సెటైర్లు వేశారు. లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు యువకులకు ఎంత మేలు చేశాడో తెలియని పరిస్ధితని.. ఆయన గళం వినాల్సిన పరిస్ధితిలో యువకులు లేరని కాకాణి గోవర్థన్ రెడ్డి దుయ్యబట్టారు. 

ఇదిలావుండగా... కాకాణి గోవర్థన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కనుపూరు కాలువ పనుల్లో మంత్రి కాకాణి రూ.30 కోట్ల అవినీతికి పాల్పడినట్లు సోమిరెడ్డి ఆరోపించారు.ఇరిగేషన్ పనులపై వాస్తవాలు చెప్పే దమ్ము ధైర్యం కాకాణికి వుందా అని ఆయన ప్రశ్నించారు. కనుపూరు కాలువపై ఇరిగేషన్ అధికారులు సమాచారం ఇవ్వడం లేదని, కాలువల పూడికతీతలో అధికారులతో కలిసి రూ.90 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. 

ALso REad: 4 వేల కి.మీ, 400 రోజుల యాత్ర: యువగళం పేరుతో లోకేష్ పాదయాత్ర

కాగా.. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రమేయం ఉన్న కేసుకు సంబంధించి నెల్లూరులోని 4వ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో జరిగిన మెటీరియల్ చోరీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే సీబీఐ అధికారులు ఈ కేసుకు సంబంధించిన ఫిర్యాదుదారు, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నుంచి పలు వివరాలను సేకరించారు. తాజాగా బుధవారం మరోసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నుంచి సీబీఐ అధికారులు విచారించారు. గతవారం సీబీఐ అధికారుల విచారణ అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ అధికారులు నిర్మలాదేవి, అనంతకృష్ణన్‌లు తనను గంటన్నరకు పైగా విచారించారని చెప్పారు. వచ్చే వారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కోరారని చెప్పారు. సీబీఐ తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని సోమిరెడ్డి పేర్కొన్నారు.

click me!