సర్పంచ్ అయ్యాడా, వార్డ్ మెంబర్ అయ్యాడా.. నామినేట్ చేస్తే మంత్రయ్యాడు : లోకేష్‌పై తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Siva Kodati |  
Published : Jan 20, 2023, 05:33 PM IST
సర్పంచ్ అయ్యాడా, వార్డ్ మెంబర్ అయ్యాడా.. నామినేట్ చేస్తే మంత్రయ్యాడు : లోకేష్‌పై తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

సారాంశం

నామినేట్ చేస్తే నారా లోకేష్ మంత్రి అయ్యాడని దుయ్యబట్టారు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. లోకేష్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నొరు.  

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. లోకేశ్ ఎవరు.. అసెంబ్లీకి గెలిచి వచ్చాడా, సర్పంచ్ అయ్యాడా అని ఆయన ప్రశ్నించారు. వార్డ్ మెంబర్ అయ్యాడా..? నామినేట్ చేస్తే మంత్రి అయ్యాడని ప్రకాశ్ రెడ్డి దుయ్యబట్టారు. లోకేష్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నొరు. 

ఇకపోతే.. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై పరిటాల శ్రీరామ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై గతేడాది కేసు నమోదైన సంగతి తెలిసిందే. పరిటాల శ్రీరామ్ గురువారం పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ఆత్మకూరు మండలం లోని సింగంపల్లి, వై కొత్తపల్లి, పి. యాలేరు ఆత్మకూరు మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఆత్మకూరులో ఏర్పాటుచేసిన సభలో మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ మాట్లాడారు. ఆ సందర్భంగా ప్రసంగిస్తూ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో అతని మీద కేసు నమోదయింది.

ALso REad: కాటికి కాలు చాచినోడిని ఎవరైనా చంపుతారా : చంద్రబాబుకు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కౌంటర్

పరిటాల శ్రీరామ్ మాటలు ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య గొడవలు ఎలా ఉన్నాయని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రసంగం అనంతరం వైఎస్సార్ సీపీ నాయకులు స్థానిక పోలీస్స్టేషన్లో ఈ మేరకు పరిటాల శ్రీరామ్ పై ఫిర్యాదు చేశారు.  దీని మీద ఎస్సై శ్రీనివాసులు మాట్లాడుతూ పరిటాల శ్రీరామ్ తో పాటు, టీఎన్ఎస్ఎఫ్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  బండి పరశురామ్ పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 153 ఏ, 505 (2) కింద కేసు నమోదు చేసినట్లు  ఆయన తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?