హైకోర్టు మొట్టికాయలు, రాష్ట్రంలో సలహాదారులు ఎందరు : వివరాలు సేకరించే పనిలో జగన్ సర్కార్

By Siva KodatiFirst Published Jan 20, 2023, 6:53 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో సలహాదారుల సంఖ్యపై హైకోర్టు చీవాట్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సలహాదారుల సంఖ్య, వారి హోదాలకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో జగన్ సర్కార్ వుంది. 

ఏపీలో సలహాదారుల సంఖ్యపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. శాఖలవారీగా వివరాలు సలహాదారుల వివరాలు సేకరిస్తోంది. సలహాదారుల వివరాలు వెంటనే పంపాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు పంపింది ప్రభుత్వం. సలహాదారుల పేర్లు, హోదాకు సంబంధించిన వివరాలతో కూడిన ఫార్మాట్‌ను కూడా ప్రభుత్వం పంపింది. సలహాదారులపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో వారి సంఖ్యపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. 

కాగా.. కొద్దిరోజుల క్రితం రాష్ట్రంలో సలహాదారుల నియామకాన్ని చేపడుతున్న తీరుపై హైకోర్టు ఘాటుగా విమర్శలు చేసింది.ఇదే కొనసాగిస్తే ఉద్యోగులకు డీఏలు ఇచ్చేందుకు కూడా సలహాదారులను నియమిస్తారేమోనంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతి విభాగానికి సలహాదారులను నియమిస్తే సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లేనపని అభిప్రాయపడింది. దేవాదాయ శాఖలో జ్వాలాపురపు శ్రీకాంత్‌ను సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం పై విధంగా వ్యాఖ్యలు చేసింది. 
 

click me!