2023లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు అదే పని.. : మంత్రి జోగి రమేష్

Published : Dec 31, 2022, 01:06 PM IST
2023లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు అదే పని.. : మంత్రి జోగి రమేష్

సారాంశం

వైసీపీకి 2022 విజయనామ సంవత్సరమని ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్ అన్నారు. ఏ ఎన్నిక జరిగినా వైసీపీ విజయం సాధించిందని చెప్పారు.

వైసీపీకి 2022 విజయనామ సంవత్సరమని ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్ అన్నారు. ఏ ఎన్నిక జరిగినా వైసీపీ విజయం సాధించిందని చెప్పారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అడ్డా  కుప్పం‌లో వైసీపీ జెండా ఎగిరిందన్నారు. మున్సి ప్రతి ఇంటిలో అభివృద్ది, సంక్షేమం వెల్లివిరిసిన సంవత్సరమని అన్నారు. శనివారం జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. 2022లో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ఆనందం నింపిందన్నారు. అయితే ఈ ఏడాది చంద్రబాబుకు మాత్రం ఏడుపును మిగిల్చిందన్నారు. చంద్రబాబు, లోకేష్‌, దత్తపుత్రుడు, అయ్యన్నపాత్రుడు.. వంటివారికి ఈ ఏడాది  బూతులనామ సంవత్సరంగా మిగిలిపోయిందని విమర్శించారు. 

కొత్త సంవత్సరంలో మరింతగా మేలైన కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళ్తామని చెప్పారు. 2023 చంద్రబాబు, దత్తపుత్రుడులకు పచ్చిబూతులు ఎలా తిట్టాలని ట్రైనింగ్ అయ్యే సంవత్సరంగా మారబోతుందంటూ విమర్శించారు. అభివృద్ది అంటే ఒక కులానికో, వర్గానికో జరగడం కాదని అన్నారు. ప్రతి పేదవారికీ అభివృద్ది ఫలాలు అందాలనే కోరుకునే వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. కందుకూరు ఘటనకు చంద్రబాబు బాధ్యుడని.. అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని విమర్శించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే