తోపుదుర్తిపై కామెంట్స్.. పరిటాల శ్రీరామ్ పై ఆత్మకూరులో కేసు నమోదు..

Published : Dec 31, 2022, 08:44 AM IST
తోపుదుర్తిపై కామెంట్స్.. పరిటాల శ్రీరామ్ పై ఆత్మకూరులో కేసు నమోదు..

సారాంశం

పరిటాల శ్రీరామ్ మీద ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. తోపుదుర్తిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు నమోదయ్యింది. 

ఆత్మకూరు : ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై పరిటాల శ్రీరామ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదయ్యింది. పరిటాల శ్రీరామ్ గురువారం పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ఆత్మకూరు మండలం లోని సింగంపల్లి, వై కొత్తపల్లి, పి. యాలేరు ఆత్మకూరు మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఆత్మకూరులో ఏర్పాటుచేసిన సభలో మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ మాట్లాడారు. ఆ సందర్భంగా ప్రసంగిస్తూ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో అతని మీద కేసు నమోదయింది.

పరిటాల శ్రీరామ్ మాటలు ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య గొడవలు ఎలా ఉన్నాయని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రసంగం అనంతరం వైఎస్సార్ సీపీ నాయకులు స్థానిక పోలీస్స్టేషన్లో ఈ మేరకు పరిటాల శ్రీరామ్ పై ఫిర్యాదు చేశారు.  దీని మీద ఎస్సై శ్రీనివాసులు మాట్లాడుతూ పరిటాల శ్రీరామ్ తో పాటు, టీఎన్ఎస్ఎఫ్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  బండి పరశురామ్ పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 153 ఏ, 505 (2) కింద కేసు నమోదు చేసినట్లు  ఆయన తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations