గుంట నక్కలు, ఊరకుక్కలు, పందులు.. మరసారి పవన్, చంద్రబాబులపై జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jul 28, 2023, 05:35 PM IST
గుంట నక్కలు, ఊరకుక్కలు, పందులు.. మరసారి పవన్, చంద్రబాబులపై జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలు

సారాంశం

సింహాన్ని ఎదుర్కొనేందుకు గంట నక్కలు, ఊరకుక్కలు ఒక్కటయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లపై మంత్రి జోగి రమేష్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో వుంటూ ఆంధ్రప్రదేశ్‌పై విషం కక్కుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లపై మంత్రి జోగి రమేష్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్మక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సింహాన్ని ఎదుర్కొనేందుకు గంట నక్కలు, ఊరకుక్కలు ఒక్కటయ్యాయని విమర్శించారు. చంద్రబాబు, పవన్‌లకు అసలు ఏపీలో ఆధార్, సొంతిల్లు వుందా అని జోగి రమేశ్ ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో వుంటూ ఆంధ్రప్రదేశ్‌పై విషం కక్కుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. 

దమ్ము, ఖలేజా వుంటే సింగిల్‌గా పోటీ చేయాలని చంద్రబాబు, పవన్‌లకు జోగి రమేష్ సవాల్ విసిరారు. ఎన్నికలకు నక్కలు , కుక్కలు, పందులు కలిసి వస్తాయని.. కానీ సింహం సింగిల్‌గానే వస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈసారి జరిగే ఎన్నికల్లో కోనసీమ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండా ఎగురవేస్తామని జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. 

ఇకపోతే.. ఇటీవల సీఆర్‌డీఏ పరిధిలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ పిచ్చి కుక్క అని.. చంద్రబాబు ముసలి నక్క అంటూ తీవ్ర పదజాలంతో కామెంట్ చేశారు.  సీఎం జగన్ పెత్తందార్ల కోటలను బద్దలు కొట్టారని అన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తుంటే.. కోర్టుకెళ్లిన దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పేదల పక్షాన పోరాటం చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్ కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు గాలికొదిలేస్తే ఆయన కొడుకు లోకేష్ ఇష్టమొచ్చినట్టుగా  తిరుగుతున్నాడని.. అతడికి జగన్‌తో పోటీపడే స్థాయి లేదని అన్నారు. 

ALso Read: జోగి రమేష్ ఓ పోరంబోకు... ఆ మహిళా మంత్రిని లోబర్చుకుని..: జనసేన నేత సంచలన వ్యాఖ్యలు

‘కుక్కలు చిత్తకార్తెలో రోడ్ల మీదకు వచ్చి మొరుగుతాయి. వీళ్లంతా చిత్తకార్తె కుక్కులు వీళ్లందరూ. మా ఎస్సీల కోసం, మా ఎస్టీల  కోసం, మా బీఎసీల కోసం, మా మైనారిటీలు కోసం, మా నిరూపేదల కోసం జగనన్న పోరాడుతుంటే.. ముసలినక్క చంద్రబాబు నాయుడు మొరుగుతున్నాడు. నక్కలు శవాలను కూడా పీక్కుతింటాయి. చంద్రబాబు అలాగే పేదలను పీక్కుతిన్నాడు. పవన్ కల్యాణ్ ఒక పిచ్చి కుక్క. పవన్ కల్యాణ్ పెళ్లాలను మార్చడం కాదు.. పార్టీలను కూడా మార్చాడు.  మార్చడం, తార్చడం అనేది పవన్ కల్యాణ్‌కు వెన్నతో పెట్టిన విద్య’’ అని జోగి రమేష్ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. 

పవన్ కల్యాణ్, డిల్లీలో ఉన్న విగ్గు  రాజుతో కలిసి ఏ పార్టీని ఏ పార్టీతో కలపాలి, ఏ పార్టీతో కలిసి పోటీ చేయించాలనే కంపెనీ పెట్టుకోవచ్చని విమర్శించారు. ఈ సమయంలో వేదికగా సీఎం జగన్ చిన్నగా నవ్వుతూ కనిపించారు. అయితే జోగి రమేష్ ప్రసంగం మధ్యలో మాత్రం సీఎం జగన్ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టుగా కనిపించింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu