పవన్, చంద్రబాబు ఇద్దరూ పనికిమాలిన వెధవలే : జోగి రమేష్ (వీడియో)

Published : Aug 13, 2023, 10:48 AM ISTUpdated : Aug 13, 2023, 11:03 AM IST
పవన్, చంద్రబాబు ఇద్దరూ పనికిమాలిన వెధవలే : జోగి రమేష్ (వీడియో)

సారాంశం

మరోసారి పవన్ కల్యాాణ్, చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

విజయవాడ : జనసేన  అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టిడిపి చీఫ్ చంద్రబాబుపై మరోసారి మంత్రి జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇద్దరు పనికిమాలిన వెధవలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని... ఇకపై చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజలకు పథకాలు అందించకుంటే, పాలన సరిగ్గా చేయకుంటే, రాష్ట్రం అభివృద్ది కాకుంటే విమర్శించాలి... అంతేకానీ తమ రాజకీయ లబ్దికోసం విమర్శలు చేయడం తగదని అన్నారు. సీఎం జగన్, వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు పవన్, చంద్రబాబు లకు సిగ్గుండాలి అంటూ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. 

మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజయవాడ భవానీపురంలో నిర్వహించిన 2K రన్ కార్యక్రమాన్ని మంత్రి జోగి రమేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ తో పాటు విజయవాడకు చెందిన ప్రజాప్రతినిధులు, భారీగా వైసిపి శ్రేణులు పాల్గొన్నారు. 

వీడియో

ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ... గత అసెంబ్లీ ఎన్నికల కంటే అత్యధిక సీట్లను రానున్న ఎన్నికల్లో వైసిపి సాధించనుందని అన్నారు. సీఎం జగన్ చెప్పినట్లు వై నాట్ 175 అన్న మాటతోనే ముందుకు వెళ్తామన్నారు. 2024 ఎన్నికల్లో 175కి 175సిట్లు గెలిచి తిరుతామని మంత్రి ధీమా వ్యక్తం చేసారు. 
 
విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో వైసిపి బలోపేతంగా వుందని... ఈ మూడింటిపై పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని మంత్రి పేర్కొన్నారు. తన పుట్టినరోజు వేడుక మాదిరిగా 2K రన్ కార్యక్రమాన్ని వెల్లంపల్లి ఘనంగా నిర్వహిస్తున్నారని... ఇంత పెద్ద కార్యక్రమానికి తనను అతిథిగా ఆహ్వానించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని మంత్రి జోగి రమేష్ అన్నారు. 

Read More  గుంట నక్కలు, ఊరకుక్కలు, పందులు.. మరసారి పవన్, చంద్రబాబులపై జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలు

ఇటీవల సీఎం జగన్ పాల్గొన్న బహిరంగ సభలో మంత్రి జోగి రమేష్ చేసిన ప్రసంగం తీవ్ర దుమారం రేపింది. పవన్ ను పిచ్చి కుక్క... చంద్రబాబు ముసలి నక్క అంటూ మంత్రి తీవ్ర పదజాలంతో కామెంట్ చేశారు.అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తుంటే.. కోర్టుకెళ్లిన దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పేదల పక్షాన పోరాటం చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్ కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు గాలికొదిలేస్తే ఆయన కొడుకు లోకేష్ ఇష్టమొచ్చినట్టుగా  తిరుగుతున్నాడని.. అతడికి జగన్‌తో పోటీపడే స్థాయి లేదని అన్నారు. 

‘‘కుక్కలు చిత్తకార్తెలో రోడ్ల మీదకు వచ్చి మొరుగుతాయి. వీళ్లంతా చిత్తకార్తె కుక్కులు వీళ్లందరూ. మా ఎస్సీల కోసం, మా ఎస్టీల  కోసం, మా బీఎసీల కోసం, మా మైనారిటీలు కోసం, మా నిరూపేదల కోసం జగనన్న పోరాడుతుంటే.. ముసలినక్క చంద్రబాబు నాయుడు మొరుగుతున్నాడు. నక్కలు శవాలను కూడా పీక్కుతింటాయి. చంద్రబాబు అలాగే పేదలను పీక్కుతిన్నాడు. పవన్ కల్యాణ్ ఒక పిచ్చి కుక్క. పవన్ కల్యాణ్ పెళ్లాలను మార్చడం కాదు.. పార్టీలను కూడా మార్చాడు.  మార్చడం, తార్చడం అనేది పవన్ కల్యాణ్‌కు వెన్నతో పెట్టిన విద్య’’ అని జోగి రమేష్ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. 

అధికారిక కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకులపై ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేసిన జోగిరమేష్ పై టిడిపి, జనసేన నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జనసేన ఆందోళనలు కూడా చేపట్టింది. 
 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu
డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu