రిషికొండ పర్యటనలో నిబంధనలకు విరుద్దంగా డ్రోన్ వినియోగించినందుకు పవన్ కళ్యాణ్ పై కేసు పెడతామని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పారు.
అమరావతి: రిషికొండలో నిబంధనలకు విరుద్దంగా డ్రోన్ లు ఎగురవేసినందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై కేసులు పెడతామని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పారు.ఆదివారంనాడు విశాఖపట్టణంలో ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మీడియాతో మాట్లాడారు.
రెండు రోజుల క్రితం రిషికొండ పరిశీలనకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వెళ్లారు. అయితే ఈ సమయంలో నిబంధనలకు విరుద్దంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారని మంత్రి అమర్ నాథ్ ఆరోపించారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ కూడ జనసేన నేతలు పట్టించుకోలేదన్నారు. నిబంధనలకు విరుద్దంగా రిషికొండలో డ్రోన్ కెమెరాలను ఉపయోగించారని మంత్రి మండిపడ్డారు. అనుమతి లేకుండా ప్రభుత్వం చేసే నిర్మాణాల వద్దకు పవన్ కళ్యాణ్ వెళ్లాడన్నారు. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనాలు నిర్మాణాలు చేస్తుంటే అభ్యంతరం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
undefined
alsor read:ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ కు అనుమతి: రిషికొండకు బయల్ధేరిన జనసేనాని
ఈ విషయమై పోలీస్ కేసు నమోదు చేస్తామన్నారు.విస్సన్నపేట భూముల వద్దకు పవన్ కళ్యాణ్ వెళ్లడానికి అభ్యంతరం లేదన్నారు. అయితే విస్సన్నపేటలో తనకు ఒక్క సెంటు భూమి ఉన్నట్టు నిరూపిస్తే ఆ భూమిని వారికే రాసిస్తానన్నారు.హైద్రాబాద్ జూబ్లీహిల్స్ చిరంజీవి, చంద్రబాబు ఎక్కడ ఇళ్లు నిర్మించారని మంత్రి అమర్ నాథ్ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. ఏపీ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఏనాడైనా పవన్ కళ్యాణ్ ప్రకటించాడా అని ఆయన ప్రశ్నించారు.