అవినీతికి ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబే.. బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకునేందుకే ఢిల్లీకి : ఐటీ నోటీసులపై మంత్రి

Siva Kodati |  
Published : Sep 01, 2023, 06:39 PM IST
అవినీతికి ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబే.. బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకునేందుకే ఢిల్లీకి : ఐటీ నోటీసులపై మంత్రి

సారాంశం

అవినీతికి ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబు లాగా వుంటుందన్నారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. అవినీతి కేసుల్లో కాపాడమని కాళ్లు మొక్కేందుకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారని మంత్రి ఆరోపించారు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతికి ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబు లాగా వుంటుందన్నారు. చేసిన తప్పులు, పాపాలకు శేష జీవితంలో చంద్రబాబు ఫలితం అనుభవించక తప్పదని అమర్‌నాథ్ విమర్శించారు. అవినీతి కేసుల్లో కాపాడమని కాళ్లు మొక్కేందుకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారని మంత్రి ఆరోపించారు. ఎన్టీఆర్ పేరుతో రూపొందించిన రూ.100 నాణెం విడుదల కార్యక్రమంలో చంద్రబాబు కూర్చొన్న సీటే ఆయన స్థాయి ఎలా వుందో చెప్పిందని గుడివాడ దుయ్యబట్టారు. 

ఒక్క హెరిటేజ్ వ్యాపారంతో లక్షల కోట్లు ఎలా సంపాదించారో చంద్రబాబు ప్రజలకు చెప్పాలని గుడివాడ అమర్‌నాథ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు పిండింది ఆవుపాలో, గేదే పాలో కాదని.. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల పేరుతో ఆయన కోట్లు కొల్లగొట్టారని ఆయన ఆరోపించారు. ఐటీ నోటీసులపై తక్షణం సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. చంద్రబాబు పీఏ శ్రీనివాసే మొత్తం చిట్టా బయటపెట్టారని గుడివాడ చురకలంటించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మంత్రి చెప్పారు. 2019 ఎన్నికల నాటి ఫలితాలే మళ్లీ రిపీట్ అవుతాయని గుడివాడ జోస్యం చెప్పారు. అయ్యన్నపాత్రుడి భాష ఏమాత్రం బాలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: చంద్రబాబుకు ఐటీ నోటీసులు.. ఎల్లో మీడియా స్పందించదేం, మళ్లీ దోచుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలా : పేర్ని నాని

అంతకుముందు చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసులు ఇవ్వడంపై స్పందించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందుస్తాన్ టైమ్స్ చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసిందని పేర్ని నాని చురకలంటించారు. ప్రజల ఆస్తిని చంద్రబాబు ఎలా కొట్టేస్తాడనేది బహిర్గతమైందన్నారు. 2016 నుంచి చంద్రబాబు బాగోతం ఇప్పుడు బయటకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. 

ఇన్‌ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టులతో రూ.118 కోట్లు ముడుపులు తీసుకున్నారని నాని ఆరోపించారు.  పీఏ శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని.. రాజధాని అమరావతి పేరుతో దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ ముడుపుల బాగోతంపై ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని.. మనోజ్ పార్ధసాని ముడుపులు ఇచ్చినట్లు తేలిందని నాని ఆరోపించారు. ఈ ముడుపులను దాచి వుంచిన ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదని ఆయన ప్రశ్నించారు. 

సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారని..చంద్రబాబుకు నోటీసులపై ఎల్లో మీడియా ఎందుకు స్పందించం లేదని పేర్ని నాని నిలదీశారు. హిందుస్తాన్ టైమ్స్‌లో వచ్చిన కథనం వీరెవ్వరికి కనిపించదని ఆయన చురకలంటించారు. ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును వెంటాడుతోందని.. అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజమా.. కాదా .. అని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే ఐటీ నోటీసులపై నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పోతుల సునీతపై లోకేష్ ఇష్టానుసారం మాట్లాడారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?